Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: తెలంగాణ పోరికి ఫిదా!!

By:  Tupaki Desk   |   17 Jun 2017 10:46 AM GMT
టీజర్ టాక్: తెలంగాణ పోరికి ఫిదా!!
X
ఇప్పుడు వస్తున్న చాలా లవ్ స్టోరీలలో శేఖర్ కమ్ముల తీస్తున్న ''ఫిదా'' ఎందుకో మొదటి నుండి చాలా ఆసక్తిగానే అనిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల మేకర్ దిల్ రాజుతో ఇప్పుడు మనోడు సినిమా చేస్తున్నాడంటేనే అది చాలా కొత్తగా అనిపిస్తోంది. దానికి తోడు మెగా హీరో వరుణ్‌ తేజ్ ను లీడ్ రోల్ కు తీసుకుని ఆశ్చర్యపరిస్తే.. అసలు ప్రేమమ్ బ్యూటి సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుని షాకిచ్చేశాడు.

ఈ సినిమా తొలి టీజర్ ఇవాళే విడుదలై.. స్వచ్ఛమైన ప్రేమకథలను లైక్ చేసే ఆడియన్స్ కు బాగా నచ్చేస్తోంది. బొక్కలు సాఫ్‌ జేస్తా అంటూ తెలంగాణ స్లాంగులో మాట్లాడే హీరోయిన్. అమెరికా నుండి వచ్చి ఈమె లుక్స్ అండ్ నడవడికకు ఫిదా అయిపోయిన హీరో.. కట్ చేస్తే.. మంచు కొండల్లో ఒక డీప్ హగ్. అదే ''ఫిదా''. సాయి పల్లవి తెలంగాణ పోరి గా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం అనుకోవచ్చు. అలాగే వరుణ్‌ తేజ్ కూడా తనకు తగిన కథను ఎంచుకున్నాడనే అనుకోవాలి.

ఇకపోతే ఈ సినిమా విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది కాని.. శేఖర్ కమ్మలు తన స్లో నెరేషన్లను పక్కనెట్టేసి సినిమాను కాస్త స్పీడుగా ఎమోషనల్ గా నడిపిస్తే బాగానే ఉంటుంది. ఈ మద్యన ఆయన తీసిన లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ మరియు అనామిక వంటి సినిమాలు సదరు స్లో నెరేషన్ తో బాగా ఇబ్బందిపెట్టేశాయి. అది సంగతి.