Begin typing your search above and press return to search.
మెగా ప్రిన్స్ జర్నీలో ప్రభావవంతమైన గురువులు!
By: Tupaki Desk | 6 Sept 2020 5:00 AM ISTబుడిబుడి అడుగుల వేళ ఓనమాలు దిద్దించిన గురువును ఎవరూ మర్చిపోలేరు. అలాగే నటుడిగా ఓనమాలు దిద్దించిన గురువుల్ని.. నటనలో పాఠాలు నేర్పించి మెరుగులద్దిన గురువుల్ని కూడా మర్చిపోలేను అని చెబుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
తనతో పని చేసిన దర్శకులంతా తన గురువులేనంటూ గౌరవించారు వరుణ్ తేజ్. అందుకే తన దర్శకులందరి ఫోటోల్ని ఓచోటికి చేర్చి ఇలా గురుపూజోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. శహభాష్.. ఇతర హీరోలతో పోలిస్తే మెగా ప్రిన్స్ ఎప్పుడూ వినమ్రతలో ఒక మెట్టు పైనుంటాడని ప్రూవైంది. కెరీర్ లో వరుస ప్రయోగాలు చేస్తూ ఇలా క్రేజీ డైరెక్టర్లతో పని చేసిన అనుభవం సొంతం చేసుకున్నాడు. ఈ గురువులంతా నేర్పించిన వాటిని నేటి టీచర్స్ డే సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
``నా దర్శకులు నటుడిగా నా ప్రయాణంలో ఎంతో ప్రభావవంతమైన వాళ్లు.. మీ ప్రభావం నాపై అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో మిమ్మల్ని మీ ప్రభావాన్ని మర్చిపోను. మీ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. అందుకు ధన్యవాదాలు.. హ్యాపీ టీచర్స్ డే`` అని ఎమోషన్ అయ్యాడు వరుణ్. శ్రీకాంత్ అడ్డాల (ముకుంద)- క్రిష్- పూరి జగన్నాథ్- శ్రీనువైట్ల- శేఖర్ కమ్ముల- సంకల్ప్ రెడ్డి- వెంకీ- అనీల్ రావిపూడి- హరీష్ శంకర్ లతో వరుణ్ తేజ్ పని చేశారు. వీళ్లందరినీ టీచర్స్ గా గౌరవించడం అతడి విధేయత.