Begin typing your search above and press return to search.

సోదరి శ్రీజతో మెగా ప్రిన్స్ అనుబంధం

By:  Tupaki Desk   |   19 Feb 2016 11:50 AM IST
సోదరి శ్రీజతో మెగా ప్రిన్స్ అనుబంధం
X
ఇప్పుడు మెగా కుటుంబం మొత్తం మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు పెళ్లి ఫిక్స్ అవడమే అసలు కారణం. ఈ పెళ్లితో అందరికంటే ఎక్కువ ఫీల్ అయ్యేది పెళ్లికూతురే అని చెప్పాలి. ఇటు తనను అక్కున చేర్చుకున్న ఫ్యామిలితో పాటు.. అటు నచ్చిన వరుడిని చేసుకునే అవకాశం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అందుకే.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకునేందుకు కుటుంబ సభ్యులు ముందుకొస్తున్నారు.

చిరు చిన్న కూతురుతో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు మంచి అనుబంధం. ఇద్దరూ దాదాపుగా ఒకే వయసు వారు కావడం.. అక్కా తమ్ముళ్లు కావడంతో వీరి మధ్య రిలేషన్ ఎక్కువే. అందరి కంటే ఎక్కువగా శ్రీజతోనే గడిపేవాడు వరుణ్ తేజ్ కూడా. ఇప్పుడు తను, శ్రీజ కలిసి ఉన్న ఓ ఫోటోను అందరితో పంచకున్నాడు మెగా ప్రిన్స్.

ఇలా తామిద్దరూ ఉన్న ఓ ఫోటోను షేర్ చేయడమంటే.. నిన్ను మిస్ అవుతున్నానని ఇన్ డైరెక్టుగా చెప్పినట్లన్న మాట. మొత్తానికి కజిన్ సిస్ట్ తో ఉన్న రిలేషన్ ని ఒక్క మాట కూడా చెప్పకుండానే పంచుకున్న వరుణ్ తేజ్.. తన ఎమోషన్ ని ఇలా చెప్పుకొచ్చాడన్న మాట.