Begin typing your search above and press return to search.
గన్నులంటే అబ్బాయికీ మోజే!
By: Tupaki Desk | 1 Sept 2015 11:47 AM ISTచేత్తో అలా గన్ను పట్టుకొని ఇలా గిర గిరా తిప్పుతూ పోజివ్వడమంటే వపన్ కళ్యాణ్ కి చెప్పలేనంత ఇష్టం. సినిమాలో ఏదున్నా, ఏది లేకపోయినా గన్ను మాత్రం ఉండాల్సిందే అంటుంటాడు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్లయితే పవన్ కళ్యాణ్ కి గన్నులపై ఉన్న మోజు గురించి జోకులు కూడా చెబుతుంటారు. `బిజినెస్ మేన్` సినిమా ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఎప్పుడిస్తాడంటే అని చెబుతూ ఆయనకి గన్నులపై ఉన్న మోజు గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు... అబ్బాయ్ వరుణ్ తేజ్ కి కూడా గన్నులంటే చాలా ఇష్టమట. `కంచె` చిత్రీకరణ సమయంలో గన్నులపై ఉన్న మోజునంతా తీర్చుకొన్నా అని చెబుతున్నాడు వరుణ్.
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా `కంచె` తెరకెక్కింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఆ సినిమా సాగుతుంది. సహజత్వం కోసమని సెకండ్ వరల్డ్ వార్ లో ఉపయోగించిన నిజమైన ఆయుధాల్ని`కంచె` చిత్రీకరణ కోసం వాడారట. దూపాటి హరిబాబు అనే సైనికుడి పాత్రలో నటించిన వరుణ్ తేజ్ ఆ నిజమైన ఆయుధాల్ని పట్టుకొని చిత్రీకరణలో పాల్గొనడం ఓ చక్కటి అనుభవం అని చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వూ లో ఆయన మాట్లాడుతూ... ``యాక్షన్ చిత్రాలంటే చిన్నప్పట్నుంచీ చాలా ఇష్టం. గన్నులు చేతపట్టుకొని యాక్షన్ చేయాలని ఉండేది. ఆ కోరిక `కంచె`తో తీరిపోయింది. స్వతహాగా నాకు గన్నులంటే చాలా ఇష్టం. కానీ నిజ జీవితంలో గన్ను చేతపట్టుకొనే అవకాశం ఎప్పుడూ రాదు. ఒక నటుడిగా ఆ కోరికని తీర్చుకొన్నా`` అని చె్పుకొచ్చాడు వరుణ్ తేజ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరో్జును పురస్కరించుకొని కొద్దిసేపటి క్రితమే `కంచె` ట్రైలర్ ని విడుదల చేయించాడు వరుణ్. ట్రైలర్ విడుదలకి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరుణ్, ప్రగ్య జంటగా నటించిన `కంచె` గాంధి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న విడుదలవుతోంది.