Begin typing your search above and press return to search.

అడగండి చెబుతా అంటున్న కంచె హీరో

By:  Tupaki Desk   |   21 Oct 2015 6:03 PM GMT
అడగండి చెబుతా అంటున్న కంచె హీరో
X
మెగావారసుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన కంచె మూవీ రిలీజ్ కి మరికొన్ని గంటల టైం మాత్రమే ఉంది. ఈ టైంలో ప్రచారం కోసం ఇంటర్వ్యూలివ్వడం, టీవీల్లో చిట్ చాట్ లు సహజమే కానీ.. ఈ సైనికుడు మాత్రం నేరుగా జనాలతోనే ఇంటరాక్ట్ అయిపోయాడు.

ట్విట్టర్ లో చాట్ సెషన్ ఏర్పాటు చేసుకుని.. అడిగిన వాళ్లందరికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు వరుణ్ తేజ్. జూనియర్ ఎన్టీఆర్ మంచి వ్యక్తిగా చెప్పిన వరుణ్.. మహేష్ ని గొప్ప నటుడు అంటున్నాడు. వెంకటేష్ అయితే.. కంచె ట్రైలర్ గురించి 10నిమిషాల పాటు మాట్లాడాడంట. అంత పెద్ద మనసు ఆయనది అంటున్నాడు. హీరోయిన్లలో సమంత ఎక్స్ ట్రీమ్ లీ ట్యాలెంటెడ్ అంటున్నాడీ మెగా వారసుడు. అయితే ఇప్పటివరకూ తాను పూరీ, శ్రీకాంత్, క్రిష్ డైరెక్షన్లో నటించినా.. పూరితో చేయడం కంఫర్ట్ గా ఉంటుందన్నాడు వరుణ్ తేజ్. బాహుబలి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్లలో తాను కూడా ఉన్నానన్నాడు.

అభిమానులు వరుణ్ ని ఛాటింగ్ ద్వారా ఇంటర్వ్యూ చేసిన డీటైల్స్..

అభిమాని - పవన్ కళ్యాణ్ మూవీస్ లో అన్నిటి కంటే ఇష్టమైనది
వరుణ్ తేజ్ - తమ్ముడు

అభిమాని - నచ్చిన కోలీవుడ్ యాక్టర్
వరుణ్ తేజ్ - ఎప్పటికీ తలైవార్ రజినీకాంత్ మాత్రమే

అభిమాని - నచ్చిన హాలీడే డెస్టినేషన్
వరుణ్ తేజ్ - గోవా

అభిమాని - కొరటాల శివతో మూవీ ఎప్పుడు ?
వరుణ్ తేజ్ - అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పడం నాకిష్టం ఉండదు. ఆయన నైస్ డైరెక్టర్

అభిమాని - ఫ్యావరేట్ మూవీ ఏది ?
వరుణ్ తేజ్ - రుద్రవీణ

అభిమాని - చిరంజీవి సినిమా రీమేక్ చేస్తే దేన్ని సెలక్ట్ చేస్తారు ?
వరుణ్ తేజ్ - ఛాలెంజ్, నా ఫేవరెట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి

అభిమాని - హార్లే డేవిడ్సన్ ఎప్పుడు కొంటావు ?
వరుణ్ తేజ్ - నేను బైక్ కొనడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరూ, ఎప్పటికీ ఒప్పుకోరు

అభిమాని - పవర్ స్టార్ సాంగ్స్ దేన్ని రీమిక్స్ చేయాలని ఉంది ?
వరుణ్ తేజ్ - మేడిన్ ఆంధ్రా స్టూడెంట్

అభిమాని - గబ్బర్ సింగ్ ఎన్ని సార్లు చూసుంటారు ?
వరుణ్ తేజ్ - లెక్క చెప్పడం కష్టం. లాస్ట్ వీక్ కూడా ఓసారి చూశా