Begin typing your search above and press return to search.

కులం డైలాగ్.. ఇరగదీసిందంతే!!

By:  Tupaki Desk   |   22 Oct 2015 12:20 PM GMT
కులం డైలాగ్.. ఇరగదీసిందంతే!!
X
"కమతాన్ని నమ్ముకున్నోడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపయ్యాడు, నేత నేసే వాడు సాలి.. నువ్వెవరు అంటే నువ్వేం పని చేస్తావని.. అంతే కాని నీ నెత్తురేంటి అని కాదు.. అలా అడిగేవాడు మనిషే కాదు.." ఇదీ కంచె మూవీలో హీరో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్. కులం అని ప్రస్తావించడానికి బదులుగా.. సామాజిక వర్గం అనే మారుపేరుతో కాలం వెళ్లదీసే రోజులివి. అలాంటిది నేరుగా కులాల పేరుతో ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోతో ఓ భారీ డైలాగ్ చెప్పించడమంటే సాహసమే. కానీ క్రియేటర్ క్రిష్ ఆ ధైర్యం చేశాడు.

దసరానాడు రిలీజ్ అయిన ఈ సినిమాపై అప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది ఈ కాస్ట్ బేస్డ్ డైలాగ్. స్టోరీ లైన్ ప్రకారం 1936లో హీరో డైలాగ్ చెప్తాడు. అప్పటి నుంచి ఇఫ్పటికే 80 ఏళ్లు గడిపోయాయి. అప్పటికే కులాలను వ్యతిరేకించే పరిస్థితులు ఉంటే.. ఇప్పుడీ కులాల ప్రస్తావన ఇంకా ఎక్కువవడం శోచనీయం. ఇంత నేరుగా కులాలను ప్రస్తావించడం, అందులో ఎక్కడా ఎవరినీ విమర్శించకుండా, ఎవరినీ పల్లెత్తు మాటనకుండా.. కులాల పేర్లు చెప్పుకునే వాళ్లను విమర్శించడంతో.. క్రిష్ కు ప్రశంసలు చుట్టుముడుతున్నాయి.'

ముఖ్యంగా.. మాస్ లో అయితే.. ఈ కులాల డైలాగ్ ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది. ఈ డైలాగ్ ఉన్న సీన్ చాలా బ్రిలియంట్ గా తెరకెక్కించాడట క్రిష్. ఎవరూ అబ్జెక్షన్ చేయలేనంత బలమైన సన్నివేశం కావడంతో మనసులు హత్తుకుంటోందని మెచ్చుకుంటున్నారు జనాలు.