Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కోసం వ‌రుణ్ తేజ్ బాలీవుడ్ నే దించుతున్నాడు!

By:  Tupaki Desk   |   29 July 2022 7:30 AM GMT
పాన్ ఇండియా కోసం వ‌రుణ్ తేజ్ బాలీవుడ్ నే దించుతున్నాడు!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొన‌సాగుతోన్న పాన్ ఇండియా ఫీవ‌ర్ గురించి చె ప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు టైర్-1 హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. టైర్ -2 హీరోలు ఆ రేంజ్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా కంటెంట్ ప‌రంగా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

పాన్ ఇండియావైడ్ రిలీజ్ చేస్తే ఏ భాష‌లో క్లిక్ అయినా అక్క‌డ నుంచి భారీ వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో ప్లానింగ్ లో మార్పులు క‌నిపిస్తున్నాయి.

పాన్ ఇండియాని అని ముందుగా ప్ర‌క‌టించ‌క‌ప‌యినా..రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వచ్చే స‌రికి అన్ని భాష‌ల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ మార్కెట్ కోసం ఒక్కో హీరో ఒక్కోర‌క‌మైన స్ర్టాట‌జీని అనుస‌రిస్తూ ముందుకెళ్తున్నారు. వ‌రుణ్ తేజ్ న‌టించిన 'గ‌ని' పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగింది గానీ చివ‌రి నిమిషంలో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు.

ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. దీంతో వ‌రుణ్ శ్ర‌మంతా వృద్ధా ప్రాయాస‌గానే మిగిలిపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా అమెరికా వెళ్లి మ‌రీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. కొన్ని నెల‌లు పాటు క‌ఠోర శిక్ష‌ణ తీసుకున్నాడు. కానీ ఫ‌లితం తీవ్ర నిరాశ‌ని మిగిల్చింది. అయితే అటుపై రిలీజ్ అయిన 'ఎఫ్ -3' తో ఆ ఫెయిల్యూర్ ని బ్యాలెన్స్ చేయ‌గ‌లిగాడు.

ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా సినిమాకి సిద్ద‌మ‌వుతున్నాడా? అందుకోసం ఈసారి ఏకంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడినే రంగంలోకి దించుతున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో పేరున్న ఓ ద‌ర్శ‌కుడితో సినిమా చేసేలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారుట‌. ఈ చిత్రాన్ని ఓ వాస్త‌వ క‌థ‌తో తెర‌కెక్కించ‌నున్నార‌ని లీకులందుతున్నాయి.

మంచి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్ర‌ఖ్యాత నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ముందుకొస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్-సోనీ మ‌ధ్య అగ్రిమెంట్ కూడా జ‌రిగింద‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే వ‌రుణ్ తొలి పాన్ ఇండియా సినిమా బిగ్ స్కేల్ లో తెర‌కెక్కే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే మెగా హీరోల్లో రామ్ చ‌ర‌ణ్..అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ల‌గా అవ‌త‌రించిన సంగ‌తి తెలిసిందే.