Begin typing your search above and press return to search.

కాస్త ఆలస్యంగా రింగ్‌ లో దిగబోతున్న మెగా 'బాక్సర్‌'

By:  Tupaki Desk   |   24 Sep 2020 1:00 PM GMT
కాస్త ఆలస్యంగా రింగ్‌ లో దిగబోతున్న మెగా బాక్సర్‌
X
కరోనా కారణంగా ఆరు ఏడు నెలల క్రితం నిలిచి పోయిన సినిమాల షూటింగ్స్‌ పునః ప్రారంభం అవుతున్నాయి. యంగ్‌ హీరోలు పలువురు గత నెలలో కొందరు ఈ నెలలో తమ సినిమాల షూటింగ్‌ లను మొదలు పెట్టారు. ఆరు నెలల తర్వాత కెమెరాలకు ముందుకు వెళ్లిన యంగ్‌ హీరోలు చకచక సినిమాలను ముగించేస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు. వచ్చే నెలతో సినిమాను పూర్తి చేసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న 'బాక్సర్‌' మూవీ షూటింగ్‌ మాత్రం ఇప్పటి వరకు మొదలు కాలేదు.

'బాక్సర్‌' సినిమా షూటింగ్‌ ను నవంబర్‌ 2 నుండి మళ్లీ సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యి ఉన్నాడు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లోనే సినిమాను ప్రారంభించాలని భావించారట. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను నవంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లబోతున్నారు. లాక్‌ డౌన్‌ ముందు వరకు వైజాగ్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. సమ్మర్‌ లో సినిమా షూటింగ్‌ ను భావించారు. కాని కరోనా మొత్తం ప్లాన్‌ ను తలకిందులు చేసింది. కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ నటిస్తోంది.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాబీ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారడం ఇదే ప్రథమం. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమా కోసం ఒలంపిక్స్‌ పతాక విజేత వద్ద బాక్సింగ్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. గద్దలకొండ గణేష్‌ సినిమాతో గత ఏడాది హిట్‌ దక్కించుకున్న వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌ గా మరో విజయాన్ని ఈ ఏడాది దక్కించుకోవాలని ప్లాన్‌ చేశాడు. కాని కరోనా కారణంగా ఈ ఏడాదిలో ఆయన సినిమాలు విడుదల కావడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత బాక్సర్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.