Begin typing your search above and press return to search.

షూట్స్ సరే.. షూటింగ్ సంగతేంటి??

By:  Tupaki Desk   |   6 July 2016 11:30 AM GMT
షూట్స్ సరే.. షూటింగ్ సంగతేంటి??
X
మెగా హీరో వరుణ్ తేజ్ అరంగేట్రం చేసిన ఏడాది సమయంలోనే మూడు సినిమాలు చేసి స్పీడు చూపించాడు. ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలు ఒక ఏడాది సమయంలోపే విడుదలయ్యాయి. అయితే.. ఆ తర్వాత మాత్రం ఈ హీరో స్పీడ్ తగ్గడమే కాదు.. అసలు కొత్త సినిమాని మొదలు కూడా పెట్టలేదు. క్రిష్ తో రాయబారి చేస్తాడని భావించినా.. తర్వాత ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ ను అనౌన్స్ చేసినా.. ముహూర్తం షాట్ తర్వాత కదల్లేదు. రీసెంట్ గా శేఖర్ కమ్ములతో ఓ సినిమా అంటున్నా అదీ పట్టాలెక్కలేదు.

షూటింగ్ విషయంలో ఇంతగా లేట్ జరుగుతున్నా.. ఫోటో షూట్స్ విషయంలో భలే జోరు చూపిస్తున్నాడు ఈ మెగా హీరో. రాయబారిలో పాత్ర కోసం ముందు ఓ పెద్ద గెడ్డం పెంచాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం.. ఈ గెడ్డం లుక్ తో ఓ ఫోటో షూట్ చేశాడు. ఈ పెంచిన గెడ్డంని రకరకాలుగా మార్చుతూ.. ట్రిమ్మింగ్ చేస్తూ.. రకరకాల ప్రయోగాలు చేశాడు కూడా. వీటితో పాటు కాజల్ అగర్వాల్ తో ఓ లాంగ్ బియర్డ్ తో మరో ఫోటో షూట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ కొత్త లుక్ మరో ఫోటో షూట్ చేసి.. అభిమానులతో షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్.

ఇలా ఫోటో షూట్స్ ను తెగ చేసేస్తుండడంతో.. ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఎంతసేపూ ఫోటో షూట్సేనా.. సినిమా షూటింగ్ ఏమైనా స్టార్ట్ చేస్తావా వరుణ్ తేజ్ అంటున్నారు అభిమానులు.