Begin typing your search above and press return to search.
ఇంకా కుర్రాడికి సినిమాలున్నాయా??
By: Tupaki Desk | 2 July 2015 4:00 AM ISTఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా అన్ని ఫ్లాపులే అయ్యాయ్. ఒక్క తొలి సినిమా.. ఆ తరువాత మరో రెండు మూడు యావరేజ్‌లు.. తప్పిస్తే.. అసలు ఆడిన బొమ్మలే లేవు. 18 ఏళ్లకే హీరో అయిపోయిన వరుణ్ సందేశ్.. 25 ఏళ్లకే ఖాళీ అయిపోతాడని ఎవరైనా అనుకున్నారా? కాని 7 ఏళ్ల కెరియర్‌లో 20 సినిమాల్లో నటించేశాడు ఈ ఎన్నారై కుర్రాడు. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
హ్యాపీ డేస్‌తో హిట్టు కొట్టిన వరుణ్, తరువాత కొత్త బంగారు లోకంతో కొత్త పుంతలు తొక్కుతాడని అందరూ అనుకున్నారు. కాని ఓ ఆరు సినిమాలు వరుసగా దెబ్బ మీద దెబ్బ వేశాయ్. ఏమైంది ఈ వేళ అనే సినిమా కొద్దోగొప్పో ఆడే వరకు అసలు హిట్టే దొరకలేదు. ఆ సినిమా 2010లో వచ్చింది. అక్కడ నుండి కట్ చేస్తే ఓ పది సినిమాల్లో మనోడు కనిపించాడు కాని అస్సలు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. ప్రతీ సినిమా ఫ్లాపే. ఏది టచ్ చేసిన పరమ రొటీనే. అసలు ఇన్నేళ్లలో ఒక్క స్క్రిప్టు కూడా మనోడు సరిగ్గా ఎందుకు ఎంచుకోలేదు అని ఫిలిం నగర్‌లో వాకబు చేస్తే.. ప్రతీ సినిమాకీ 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ వస్తుందా లేదా అనే విషయం చూసుకున్నాడు కాని సినిమాలో కంటెంట్ ఎంత ఉంది అనే విషయం చూసుకోలేదు అంటున్నారు కొందరు నిర్మాతలు.
ఏదేమైనా మొన్న వచ్చిన ''లవ కుశ'' సినిమా కూడా అట్టర్ ఫ్లాపు కావడంతో ఇక వరుణ్ సందేశ్ ఈ దెబ్బ నుండి కోలుకునేలా లేడు. ఏదో ఓ రెండు సినిమాలు షూటింగ్‌లో ఉన్నా అవి సరిగ్గా సాగట్లేదని టాక్. మరి నితిన్‌కు ఇష్క్ సినిమా ఇచ్చినట్లు, ఎవరైనా ఓ దర్శకదేవుడు వరుణ్‌కు కూడా ఒక హిట్టిస్తే.. కెరియర్ డైరక్షన్ మారే ఛాన్సుంది. అది సంగతి.