Begin typing your search above and press return to search.

వరుణ్‌ రేసులోకి రావాలంటే ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   8 April 2015 3:30 AM GMT
వరుణ్‌ రేసులోకి రావాలంటే ఏం చేయాలి?
X
హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం సినిమాలతో వరుణ్‌సందేశ్‌ రేంజు ఎక్కడికో వెళ్లిందనే అనుకున్నాం. కానీ వాస్తవం వేరేలా ఉంది. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందన్న చందంగా ఉంది పరిస్థితి. వరుణ్‌సందేశ్‌ రేసులో పూర్తిగా వెనకబడ్డాడు. తనతో పాటే పరిశ్రమకి వచ్చిన నిఖిల్‌ స్టార్‌ రేంజుకు దూసుకుపోయాడు. కానీ తాను మాత్రం అక్కడే ఉన్నాడు. అయితే ఇలా ఎందుకైంది? అనే సంగతిని వరుణ్‌ అస్సలు విశ్లేషించుకున్నట్టే అనిపించదు.

కెరీర్‌ పీక్‌లో ఉండగానే ఏడాదికి నాలుగైదు సినిమాల్లో నటించేయాలనుకోవడం, ఆదరాబాదరాగా కథల్ని ఎంచుకోవడం అతడికి పెద్ద మైనస్‌. కథ, దర్శకుల ఎంపిక ఇతడికి పెద్ద డ్రాబ్యాక్‌. కథ చెప్పేటప్పుడు ఎంత అందంగా చెప్పారో.. అంతే అందంగా తెరకెక్కించడంలో దర్శకులు విఫలమయ్యారు. అందుకే నేను కూడా ఫెయిలయ్యానని వరుణ్‌ చెబుతుంటాడు. తప్పు తెలుసుకున్నా. ఇక ముందు మంచి సినిమాలు చేస్తానని గతంలో చెప్పినా అతడు మరోసారి అదే తప్పును రిపీట్‌ చేస్తున్నాడా? అనిపిస్తోంది ఇప్పుడు. తాజాగా అతడు నటించిన లవకుశ టీజర్‌ చూసినవారికి ఇదే అర్థమవుతుంది. అయితే వైఫల్యాలు సహజం. కానీ వాటినుంచి బైటికి రావడం చాలా ముఖ్యం.

నితిన్‌, నిఖిల్‌ లాంటి హీరోలు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు వైపు పయనించారు. మంచి కథల్ని ఎంచుకోవడం, దర్శకుల్ని ఎంచుకోవడం ఎలాగో నేర్చుకున్నారు. అవసరమైతే కావాల్సినంత గ్యాప్‌ తీసుకుని బాగా ఆలోచించి సరైన సినిమాలతో రీఎంట్రీ ఇచ్చి విజయాలు అందుకున్నారు. అదే బాటలో ట్యాలెంటెడ్‌ వరుణ్‌సందేశ్‌ కూడా వెళ్లాలని ఆశిస్తూ...