Begin typing your search above and press return to search.

వరుణ్‌ సందేశ్‌ సైలెంట్‌గా వచ్చేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   11 Jun 2015 8:19 PM GMT
వరుణ్‌ సందేశ్‌ సైలెంట్‌గా వచ్చేస్తున్నాడు!
X
కాస్తో కూస్తో హడావుడి చేస్తే తప్ప ప్రేక్షకులు సినిమాకి వెళ్లే పరిస్థితి లేదు. కానీ వరుణ్‌ సందేశ్‌ మాత్రం సైలెంట్‌గా తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈవారం 'కేరింత', 'జ్యోతిలక్ష్మి' సినిమాలతో పాటు వరుణ్‌ 'లవకుశ' కూడా సందడి చేయబోతోంది. వరుణ్‌సందేశ్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. మసాలా అంశాల్ని దట్టించి తీశారు. రిచాపనయ్‌తో కలిసి ఘాటైన ముద్దు సన్నివేశాల్లో నటించాడు వరుణ్‌సందేశ్‌. బ్రహ్మీని కూడా బాగానే వాడుకొన్నట్టు తెలుస్తోంది. ఫలితం ఎలా ఉంటుందో తర్వాత సంగతి కానీ... అసలు ప్రచార ఆర్భాటం లేకుండా సైలెంటుగా సినిమాని విడుదల చేస్తున్నారు. మరి వరుణ్‌కి ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ వస్తుందో చూడాలి.

అసలే వరుణ్‌సందేశ్‌కి హిట్టు లేక చాలా కాలమైంది. యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేసినా అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. అందుకే ఈసారి కామెడీని, మసాలాని నమ్ముకొని 'లవకుశ' చేశాడు. వెరైటీగా ఉంటుందని డ్యూయల్‌ రోల్‌ కూడా చేశాడు. సినిమాకి ముందు అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి హడావుడి చేశారు కానీ... విడుదల సమయంలో మాత్రం సైలెంట్‌ అయిపోయారు. సరైన పబ్లిసిటీ లేకపోవడం సినిమాకి మైనస్‌గా మారిందనే చెప్పాలి.