Begin typing your search above and press return to search.

వరుణ్, వితికలు మొదలు పెట్టేశారు

By:  Tupaki Desk   |   21 Dec 2015 1:33 PM GMT
వరుణ్, వితికలు మొదలు పెట్టేశారు
X
మొగుడూ పెళ్లాలంటే గొడవ పడిపోతుంటారు. చీటికీ మాటికీ గొడవలు పడుతూ.. అంతలోనే కలిసిపోతుంటారు. జుట్టు జుట్టూ పట్టుకుంటారు. వెంటనే చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు. అయితే.. ఇవన్నీ పెళ్లైన కొన్నాళ్ల తర్వాత అందరికీ ఎదురయ్యే పరిస్థితులే. కానీ వరుణ్ సందేశ్ - వితిక శేరులు మాత్రం అప్పుడే మొదలుపెట్టేశారు.

ఇప్పటికి వీళ్లకి నిశ్చితార్ధం అయిందంతే. కనీసం పెళ్లి కూడా కాలేదు. తాంబూలాలు ఇచ్చిన 15 రోజులకే ఇద్దరూ గొడవ పడిపోతున్నారు. అఫ్ కోర్స్.. ఇలా గొడవ నిజంగా కాదులెండి. మాంచి ఎఫెక్టివ్ ఫోటో కోసం అన్నమాట. ఫోటోలో బయట ఏమో.. వరుణ్ బుగ్గలు పట్టుకున్న వితిక - కాబోయే భార్య నడుం మీద సుకుమారంగా చెయ్యేసిన వరుణ్ సందేశ్ కనిపిస్తుంటారు. వాళ్ల వెనక ఉన్న అద్దంలో మాత్రం ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని అరిచేసుకుంటూ, కొట్టుకుంటూ ఉన్నట్లుగా.., ఓ ఫోటో డిజైన్ చేసి ఆన్ లైన్ లో పోస్టర్. ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తున్న ఈ పిక్.. భలే క్యాచీగా ఉందని చెప్పాలి.

బేసిక్ గా ఇద్దరూ యాక్టర్సే కావడంతో.. ఈ పిక్చర్ బాగా వచ్చిందని చెప్పాలి. యాక్టింగ్ చేయడంలో ఆరితేరిన వీళ్లిద్దరూ ఫోటో ఫోజు కోసం కూడా మంచి ఫీలింగ్స్ తో ఫోజ్ ఇచ్చారు. ఏమైనా కుర్ర జంటలో క్రియేటివిటీ ఎక్కువగానే ఉన్నట్లుంది. అందుకే ఇలాంటి డిఫరెంట్ ఫోజులతో పోటో తీయించేసుకున్నారు. ఫోటో ఫోజులు బాగానే ఉన్నాయ్ కానీ.. రియల్ లైఫ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ జంటకు సలహా ఇచ్చేద్దాం.