Begin typing your search above and press return to search.

లిప్‌లాక్‌తో వరుణ్‌ను కాపాడేస్తుందా?

By:  Tupaki Desk   |   9 April 2015 9:30 AM GMT
లిప్‌లాక్‌తో వరుణ్‌ను కాపాడేస్తుందా?
X
యముడికి మొగుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది రిచాపనాయ్‌. అల్లరి నరేష్‌ సరసన ఆ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన 'చందమామ కథలు' సినిమాలో ఓ కీలకపాత్ర పోషించింది. బుర్ఖా ధరించే ఓ ముస్లిమ్‌ యువతిగా నటించి ఆకట్టుకుంది. చందమామ కథలు సినిమాకి జాతీయ అవార్డు సైతం దక్కింది.

ప్రస్తుతం ఈ భామ వరుణ్‌సందేశ్‌ సరసన 'లవకుశ' చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఇందులో తన పాత్ర గురించి రిచా మాట్లాడుతూ.. లవకుశ చిత్రంలో ఓ గ్రామీణ యువతిగా నటించాను. లోకల్‌ భాషలో మాట్లాడాలి. గ్రామీణ యువతి ఆహార్యం ప్రదర్శించాలి. ఈ సినిమా కోసం సెటలో ఎంతో శ్రమించాను అని చెప్పింది.

వరుణ్‌తో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించాల్సొచ్చింది కదా అని ప్రశ్నిస్తే అది ప్రొఫెషన్‌లో భాగంగానే అని సమాధానమిచ్చింది. ఈ పెదవి ముద్దుతో అమ్మడు టాలీవుడనని టేకోవర్‌ చేస్తుందేమో చూడాలి. లేదంటే ఎప్పటనుండో అందని విజయాన్ని వరుణ్‌ సందేశ్‌కు అందిస్తుందా?