Begin typing your search above and press return to search.

సీక్రెట్ టాస్క్: ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిన ఆ ముగ్గురు

By:  Tupaki Desk   |   28 Aug 2019 4:57 AM GMT
సీక్రెట్ టాస్క్: ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిన ఆ ముగ్గురు
X
బిగ్ బాస్ షో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎలిమినేషన్ లో ఉన్నవారిని సేఫ్ చేసే ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్ లో చోటు చేసుకుంది. సోమవారం మహేశ్ - పునర్నవి - హిమజ - రవి - రాహుల్ - వరుణ్ లు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే వీరికి బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో ఓ డీల్ ఇచ్చారు. ఈ డీల్ లో భాగంగా ఇచ్చే టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేస్తే వారికి ఇమ్యూనిటీ లభించి ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పారు.

అయితే ఈ టాస్క్ లో ముగ్గురు మాత్రమే పాల్గొనాలి కాబట్టి ఆరుగురు చర్చించుకుని టాస్క్ లో పాల్గొనే ఆ ముగ్గురు ఎవరు నిర్ణయించుకోవాలని చెబుతాడు. దీంతో వారు చర్చించుకుని రవి - రాహుల్ - వరుణ్ లు సీక్రెట్ టాస్క్ లో పాల్గొనడానికి ముందుకు వస్తారు. అయితే ఈ ముగ్గురు డీల్ గురించి హౌస్ లోని మిగతా సభ్యులతో చర్చించకూడదని రూల్ పెడతారు. ఇక డీల్ లో భాగంగా బిగ్ బాస్ ముందుగా రవికృష్ణకు ఛాలెంజ్ ఇచ్చారు. యాక్టివిటీ రూంలో బోర్డుపై మొత్తం 8 ఛాలెంజ్‌ లు రాసి పెట్టారు. వీటిలో రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

దీంతో రవి 1. ఒకరి తలనిండా షేవింగ్ ఫోమ్ రాయాలి 2. ఒకరి బెడ్‌ ని పూర్తిగా నీటితో తడపాలి అనే వాటిని ఎంచుకున్నాడు. ఇక ఎంచుకుని టాస్క్ లో దూకిన రవి వితిక తలని ఫోమ్ తో నింపేశాడు. అలాగే శివజ్యోతి బెడ్ ని పూర్తి నీటితో తడిపేశాడు. ఇక రాహుల్ ఇచ్చిన డీల్ లో భాగంగా 1. ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి వారితో గొడవ పడాలి 2. వరుణ్ మరియు వితిక హార్ట్ షేప్ కుషన్‌ ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌ లో విసరాలి. వీటిలో మొదటిగా హార్ట్ షేప్ కుషన్‌ ను కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌ లో వేసేశాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో సీరియస్ గానే గొడవపడ్డాడు. వారిలో అలీ - శ్రీముఖి -శివజ్యోతి - హిమజలు టెంపర్ లాస్ అయ్యి రాహుల్ మీద కొప్పడ్డారు.

ఇక వరుణ్ టాస్క్ 1. చల్లని కాఫీని ఒకరి మీదకి విసరాలి 2. హౌస్‌ లో ఎవరైనా ఒకరి ఇష్టమైన బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. మొదటిది తన భార్య వితికపై ప్రయోగించేశాడు. ఆ తరవాత స్లీపింగ్ రూంలోకి వెళ్లి వితికాకు ఇష్టమైన బట్టలు తీసి ముక్కలుగా కత్తిరించి టాస్క్ పూర్తి చేశాడు. చివరికి టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసినందుకు వరుణ్ - రవి - రాహుల్ లు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారని బిగ్ బాస్ చెబుతాడు. ఇక విషయం తెలుసుకున్న హౌస్ మేట్స్ ఊపిరి పీల్చుకుంటారు. చివరికి ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులని క్షమాపణ కోరారు.