Begin typing your search above and press return to search.

వ‌రుణ్ ఈజ్ బ్యాక్‌.. హ్యాపీడేస్ వ‌చ్చేస్తాయా..?

By:  Tupaki Desk   |   2 May 2021 11:30 PM GMT
వ‌రుణ్ ఈజ్ బ్యాక్‌.. హ్యాపీడేస్ వ‌చ్చేస్తాయా..?
X
చేసిన తొలి సినిమానే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొడితే.. ఆ హీరో ఫీలింగ్స్ ను క్యాచ్ చేయ‌డం ఎవ్వ‌రి త‌ర‌మూ కాదు. అలాంటి ‘ఫ‌స్ట్ హిట్’ క్లబ్ లో చేరిన హీరో వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’లో లీడింగ్ క్యారెక్టర్లో నటించిన వరుణ్.. బంపర్ హిట్ అందుకున్నాడు.

ఆ త‌ర్వాత ‘కొత్త‌బంగారు లోకం’ అంటూ మరో సెన్సేషన్ నమోదు చేశాడు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో యూత్ ను ఉర్రూతలూగించింద‌నే చెప్పాలి. కానీ.. ఈ సినిమా త‌ర్వాత వ‌రుణ్‌ అప‌జ‌యాల లోకంలోనే కొట్టుమిట్టాడాల్సి వ‌చ్చింది. దాదాపు 20 సినిమాల్లో న‌టించినా.. స‌రైన హిట్ ల‌భించ‌లేదు.

చివ‌ర‌కు ఒక‌టీ రెండు సినిమాల్లో గుంపులో గోవింద పాత్ర‌లు కూడా చేశాడు. ఇక‌, సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టే అనుకున్న త‌ర్వాత ‘బిగ్ బాస్’షోకు ఫ్యామిలీతో సహా వెళ్లిపోయాడు. మధ్యలోనే తిరిగొచ్చేశాడు. వరుణ్ సందేశ్.. చాప్టర్ క్లోజ్ అనుకున్న తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ముందుకు వస్తున్నాడీ హీరో.

ఒక‌ర‌కంగా ఇది రీ-ఎంట్రీ. శ్రీబాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎంఎస్ఆర్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఇందువదన’ అనే చక్కటి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌బోతున్నారు. మరి, ఈ సినిమాతోనైనా వరుణ్ సందేశ్ కు హ్యాపీ డేస్ వస్తాయా? మరోసారి స‌రికొత్త బంగారు లోకంలో విహ‌రిస్తాడా? అన్న‌ది చూడాలి.