Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌:బాబా స్మార్ట్ గేమ్..మళ్ళీ ఫ్రూట్ అయిన వరుణ్..

By:  Tupaki Desk   |   2 Oct 2019 6:18 AM GMT
బిగ్‌ బాస్‌:బాబా స్మార్ట్ గేమ్..మళ్ళీ ఫ్రూట్ అయిన వరుణ్..
X
ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘రాళ్లే రత్నాలు’టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కెప్టెన్ శ్రీముఖి మినహా మిగతా 8 మంది సభ్యులు ఆడాలి. ఈ టాస్క్ ప్రకారం ఆకాశం నుంచి 20 - 50 -100 - 200 రూపాయల విలువ చేసే రాళ్ళు పడతాయి. వాటిని ఇంటి సభ్యులు పట్టుకుని దాచుకోవాలి. ఈ టాస్క్ నాలుగు రౌండ్లు జరిగింది. సోమవారం ఎపిసోడ్ లో జరిగిన మొదటి రౌండ్ లో అందరి కంటే తక్కువ విలువ గల రాళ్ళు ఉండటంతో రాహుల్ నామినేట్ అయ్యాడు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో పలు దఫాలుగా రాళ్ళ వర్షం పడగా - కంటెస్టంట్స్ వాటిని పట్టుకుని దాచుకున్నారు.

ఈ క్రమంలో రెండో రౌండ్ బజర్ కూడా మ్రోగింది. దీంతో కెప్టెన్ శ్రీముఖి కంటెస్టంట్స్ దగ్గరున్న రాళ్లని లెక్క పెట్టగా..అందరికంటే తక్కువ ఉండటంతో మహేష్ నామినేట్ అయ్యాడు. తర్వాత మూడో రౌండ్లో కూడా రాళ్ళ వర్షం కురవగా - ఇంటి సభ్యులు వాటి కోసం ఎగబడ్డారు. రాళ్లని బుట్టల్లో - తట్టల్లో దాచుకున్నారు. నెక్స్ట్ బజర్ మ్రోగినప్పుడు శ్రీముఖి అందరి దగ్గర రాళ్లని లెక్కపెట్టింది. అందులో పునర్నవి దగ్గర తక్కువగా ఉండటంతో ఆమె నేరుగా నామినేట్ అయింది. ఇక చివరి రౌండ్ లో అలీ - శివజ్యోతి - వితికా - బాబా భాస్కర్ - వరుణ్ తలపడ్డారు.

పోటాపోటిగా రాళ్లని పట్టుకున్నారు. చివరి రౌండ్ కావడంతో అందరూ ఆసక్తితో వారి దగ్గరున్న రాళ్ళ విలువని ముందే లెక్కపెట్టుకున్నారు. ఆ సమయంలో బాబా స్మార్ట్ గేమ్ ఆడాడు. తన దగ్గర అందరికంటే తక్కువ రాళ్ళు ఉన్నాయని చెప్పాడు. అయితే వరుణ్ కూడా తన విలువని చెప్పగా - బాబా కంటే 100 తక్కువ ఉందని చెప్పాడు. దీంతో వితికా తన దగ్గర 100 తీసుకుని వరుణ్ కు ఇచ్చేసింది. వరుణ్ కు వంద కలవడంతో బాబాతో సమానంగా ఉన్నాయని భావించాడు.

దీంతో నెక్స్ట్ రాళ్ళ వర్షం పడ్డప్పుడు అందరు పోటాపోటిగా పట్టుకున్నారు. రాళ్ళ వర్షం ఆగగానే లాస్ట్ బజర్ మ్రోగింది. కెప్టెన్ శ్రీముఖి అందరి దగ్గర రాళ్లని లెక్కపెట్టగా - అలీ ఫస్ట్ ఉన్నాడు. సెకండ్ బాబా - థర్డ్ వితికా - ఫోర్త్ శివజ్యోతి - లాస్ట్ లో వరుణ్ ఉన్నాడు. దాంతో వరుణ్ నామినేట్ అయ్యాడు. అయితే బాబా తక్కువ ఉన్నాయని అబద్దం చెప్పి స్మార్ట్ గేమ్ ఆడాడని వరుణ్ కు చివరిలో అర్ధమైంది. చివరికి ఈ వారం రాహుల్ - మహేష్ - పునర్నవి - వరుణ్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లారు.