Begin typing your search above and press return to search.
సాటి హీరోని బెదిరించిన ముగ్గురు హీరోలు
By: Tupaki Desk | 24 Dec 2020 9:00 AM ISTఆ అందాల హీరోయిన్ ఇప్పటికే యూత్ లో హాట్ ఫేవరెట్ గా మారింది. తనదైన అందం చందం ప్రతిభతో కుర్రకారు గుండెల్లో యువరాణిగా కొలువు దీరింది. అంతేనా కవ్వించే ఈ అందాల హీరోయిన్ వరుసగా కుర్రహీరోలకు ఫేవరెట్ గా మారింది. ఇక ఈ బ్యూటీతో ప్రేమలో పడిన పాపం పసోడి గురించి ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగింది. అదంతా సరే కానీ.. ప్రస్తుతం ఓ సినిమాలో ఈ అమ్మడి సరసన నటిస్తున్న కుర్రహీరోని ఇంతకుముందు తనతో కలిసి నటించిన ఇతర హీరోలు తీవ్రంగా హెచ్చరించారట. తనతో జాగ్రత్త గా ఉండాలన్నది సదరు హీరోల హెచ్చరిక.
ఇంతకీ ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ ఎవరు.. ఆ ముగ్గురు కుర్రహీరోలు ఎవరు? అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి. బాలీవుడ్ రీమేక్ మూవీ `కూలీ నంబర్ 1` లో నటిస్తున్న వరుణ్ ధావన్ - సారా అలీ ఖాన్ జంట గురించే ఈ చర్చంతా. ఈ జోడీ తెరపై మొదటిసారి కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కరోనావైరస్ కి భయపడుతున్నప్పటికీ ఇద్దరు నటులు తమ సినిమాను సోషల్ మీడియా ద్వారా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మీడియాలో ఎంచుకున్న ప్రదర్శనలలో కనిపిస్తున్నారు. ఇటీవల వీరిద్దరిని కపిల్ శర్మ షోలోనూ సందడి చేశారు.
ఈ వేదికపై వరుణ్ చెప్పిన ఓ సంగతి అభిమానుల్ని షాక్ కి గురి చేసింది. వరుణ్ ధావన్ ని సాటి యువహీరోలు ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశల్.. కార్తీక్ ఆర్యన్ తీవ్రంగానే హెచ్చరించారట. సారా అలీ ఖాన్ తో కలిసి పనిచేయడం పై తొలుత ఆ ముగ్గురూ హెచ్చరించారు
ఎపిసోడ్ ప్రోమో వీడియోలో వరుణ్ తన సహనటి సారా గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. ఇంకే సాత్ కమ్ కర్ రాహా థా తో ముజే .. ఆయుష్మాన్, ... కార్తీక్ .. విక్కీ కౌషల్ .. సబ్నే మెసేజ్ కియా థా.. ఆశ్చర్యపోయిన సారా అతనిని, “క్యా బోలా థా?” అని అడుగుతుంది. దానికి వరుణ్, “కి బచ్కే రెహ్నా” అని బదులిచ్చారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో ఫన్నీగా రక్తి కట్టించింది.