Begin typing your search above and press return to search.

బాహుబలి3 లోనా?? కుదరదు!!

By:  Tupaki Desk   |   17 July 2017 12:16 PM IST
బాహుబలి3 లోనా?? కుదరదు!!
X
రిలీజైన అన్ని భారతీయ భాషల్లో బాహుబలి సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఓ సౌత్ సినిమా కలెక్షన్ల కనకవర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాహుబలిలో యాక్ట్ చేసిన నటులందరికీ మంచి పేరు రావడంతో చేస్తే అలాంటి పాత్రలు చేయాలన్న ఫీలింగ్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు.

బాహుబలి సినిమా నెక్ట్స్ పార్ట్ తీస్తే అందులో నటించాలని ఉందంటూ తాజాగా బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ కోరిక బయటపెట్టాడు. అతడు నటించిన డిష్యూం సినిమాకు ఐఫా నుంచి బెస్ట్ కామిక్ యాక్టర్ అవార్డు వచ్చింది. ముంబయిలో జరిగిన ఐఫా-2017 ఫంక్షన్ కు వచ్చిన వరుణ్ ధావన్ తాను ఎక్కువగా కామెడీ రోల్స్ నే చేస్తున్న విషయం గుర్తు చేసుకున్నాడు. సీరియస్ పాత్రలు ట్రయ్ చేయాలని ఉందన్నాడు. ఇదే ఫంక్షన్ కు వచ్చిన బాహుబలి హిందీ వెర్షన్ రిలీజ్ చేసిన నిర్మాత కరణ్ జోహార్ ను బాహుబలి-3 తీస్తే అందులో తనను తీసుకోవాలని అడిగాడు. కానీ కరణ్ జోహార్ మాత్రం వెంటనే కుదరదు అని ఆన్సర్ ఇచ్చేశాడు. దీంతో షాక్ తినడం వరుణ్ వంతయింది. ఎందుకు కుదరదని వరుణ్ తిరిగి ప్రశ్నించడంతో తర్వాత మాట్లాడదాం అంటూ కరణ్ జోహార్ మాట దాటవేశాడు.

వరుణ్ ధావన్ కు ఐఫా అవార్డు లభించిన డిష్యూం చిత్రాన్ని అతడి సోదరుడు రోహిత్ ధావన్ తెరకెక్కించడం విశేషం. తన సోదరుడు డైరెక్షన్ చేసిన సినిమాకు అవార్డు తీసుకోవడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ ధావన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.