Begin typing your search above and press return to search.

మ‌న‌సిచ్చే నికార్స‌యిన వ‌రుడు కావ‌లెను!

By:  Tupaki Desk   |   29 Aug 2021 2:30 PM GMT
మ‌న‌సిచ్చే నికార్స‌యిన వ‌రుడు కావ‌లెను!
X
నికార్స‌యిన వరుడి కోసం శోధన ఇప్పుడు వేగవంతం అవుతోంది..సరదాగా ఉండే #వరుడు కావలెను .. టీజర్ ఆగస్టు 31 న విడుదల కానుంది! అంటూ ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఎట్ట‌కేల‌కు నాగ‌శౌర్య వ‌రుడు కావలెను టీజ‌ర్ కి ముహూర్తం ఫిక్స‌య్యింది. ఇక‌పై స‌ర‌దా స‌ర‌దాగా సాగుతుంది కాలం.

ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌పై సినిమాలు అరుదుగానే వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో శ‌త‌మానం భ‌వ‌తి.. అమ్మ‌మ్మ గారిల్లు లాంటివి ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌పై వ‌చ్చిన ఆస‌క్తిక‌ర సినిమాలు. ఇలాంటివి యాక్ష‌న్ మాఫియా హార‌ర్ సినిమాల న‌డుమ ఆడియెన్ కి మంచి రిలీఫ్ గా వ‌స్తుంటాయి. లేటెస్ట్ గా ఫ్యామిలీస్ ఆద‌రించే క‌థాంశంతో వ‌రుడు కావ‌లెను తెర‌కెక్కుతోంది. నాగ‌శౌర్య‌- రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఇటీవ‌ల ప్ర‌చారంతో కొంత హైప్ ని తేగ‌లిగారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఒక సింపుల్ ఫ్యామిలీ స్టోరీ ఇద‌ని అర్థ‌మ‌య్యేలా సంక్రాంతి పోస్ట‌ర్ ని డిజైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. వరుడు కావలెను కుటుంబం ఒకే ఫ్రేమ్ ‌లో క‌నిపించి `సంక్రాంతి శుభాకాంక్షలు` పంప‌డంతో ఇది ప‌క్కా ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా అని అర్థ‌మైంది.

ఇందులో మురళి శర్మ-న‌దియా లాంటి సీనియ‌ర్లు ఉండ‌డంతో న‌ట‌న‌తోనే బోలెడంత మ్యాజిక్ చేస్తార‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఇంత‌కుముందే ప్ర‌చార వీడియో ఆక‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ లిరిక‌ల్ వీడియోలు ట్రైల‌ర్ తో హీట్ పెంచ‌నున్నారు. పోస్ట‌ర్లు ఇప్ప‌టికే వైర‌ల్ గా దూసుకెళ్లాయి. సితారా ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.