Begin typing your search above and press return to search.

టీజర్: ఈ వధువు కు అంత ఈజీగా వరుడు దొరికేలా లేడు..!

By:  Tupaki Desk   |   31 Aug 2021 5:08 AM GMT
టీజర్: ఈ వధువు కు అంత ఈజీగా వరుడు దొరికేలా లేడు..!
X
యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ''వరుడు కావలెను'' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తి చేశాడు. ఇందులో శౌర్య కు జోడీగా తెలుగమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో ల‌క్ష్మీ సౌజ‌న్య డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'కోల కళ్ళే ఇలా' పాట - కాంట్రవర్సీ అయిన 'దిగు దిగు నాగ' సాంగ్ కూడా జనాల్లోకి బాగా వెళ్లాయి. ఈ క్రమంలో నేడు ప్రొడ్యూసర్ రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై ఏళ్ళు వచ్చినా అబ్బాయిలను రిజెక్ట్ చేసే నేటితరం అమ్మాయిగా పొగరున్న యువతిగా రీతూ వర్మని ఈ టీజర్ లో చూపించారు. అయితే ఆమె అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్లు ఉంటుందంటూ రీతూ ప్రేమలో పడ్డాడు మన నాగ శౌర్య. చాక్లెట్ ఇచ్చినా ఫ్లర్ట్ చేయడానికి అనుకునే టిపికల్ అమ్మాయి ని హ్యాండ్సమ్ అబ్బాయి ఎలా ప్రేమలో దింపాడు? వధువుగా ఎలా మార్చుకున్నాడు? అనేది తెలియాలంటే ''వరుడు కావలెను'' సినిమా చూడాల్సిందే.

ఫన్నీగా సాగిన ''వరుడు కావలెను'' టీజర్ అందరినీ అలరిస్తోంది. ఇది లవ్ అండ్ ఎమోషన్స్ తో అందమైన కుటుంబ కథా చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్య తల్లిగా నదియా కనిపిస్తున్నారు. మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గణేష్ కుమార్ రావూరి మాటలు అందించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'దిగు దిగు నాగ' పాటకు మాత్రం ఎస్.ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు.

''వరుడు కావలెను'' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ కలిసి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ టీజర్ ద్వారా ప్రకటించారు.