Begin typing your search above and press return to search.

రొమాంటిక్‌ - వరుడు కావలెను.. బిగ్ క్లాష్‌

By:  Tupaki Desk   |   20 Oct 2021 1:22 PM IST
రొమాంటిక్‌ - వరుడు కావలెను.. బిగ్ క్లాష్‌
X
డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ తనయుడు పూరి ఆకాష్‌ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా విడుదల విషయంలో చాలా నెలలుగా ఉన్న సస్పెన్స్ కు తెర దించి ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న డార్లింగ్‌ ప్రభాస్ తో ట్రైలర్‌ లాంచ్‌ చేయించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ తో యూత్‌ ఆడియన్స్ లో కాస్త ఆసక్తి పెరిగింది. పూరి మార్క్ కనిపించడంతో పాటు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యే కంటెంట్ అంటూ రొమాంటిక్ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ను రూపొందించినట్లుగా చెబుతున్నారు. ఇక అదే 29వ తారీకున నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్‌ గా నటించిన వరుడు కావలెను సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈమద్య కాలంలో ప్రముఖ నిర్మాతగా పేరు బాగా పాపులర్ అయిన నాగ వంశీ సూర్యదేవర వరుడు కావలెను సినిమాను నిర్మించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. భీమ్లా నాయక్‌ నిర్మాత నిర్మించిన సినిమా అవ్వడం వల్ల మార్కెట్ లో వరుడు కావలెను కు మంచి డిమాండ్ ఉంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నాయి. రొమాంటిక్ మాస్ మసాలా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో కూడుకున్నదిగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. యూత్‌ ఆడియన్స్ కు ఖచ్చితంగా కనెక్ట్‌ అయ్యే రొమాంటిక్ సన్నివేశాలు మరియు పూరి ఆకాష్‌ చెప్పే రొమాంటిక్ డైలాగ్స్ వీటన్నింటి వల్ల రొమాంటిక్ ఒక యూత్‌ ఫుల్‌ మూవీగా నిలుస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుడు కావలెను విషయానికి వస్తే ఇప్పటి వరకు వచ్చిన పాటలు మరియు స్టిల్స్ వీడియోలను చూస్తుంటే సినిమా ఒక మంచి డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుందనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఖాయం అంటున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ కూడా మూకుమ్మడిగా బాక్సాఫీస్‌ వద్దకు దూసుకు వస్తున్నాయి. అందుకే ఈ సినిమాలు రెండు గ్యాప్ లేకుండా విడుదల చేయాల్సి వస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని తెలుగు సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు. నాగశౌర్య వరుస ప్లాప్‌ లతో కాస్త లో లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయనకు ఈ సినిమా సక్సెస్ ఖచ్చితంగా మంచి బూస్ట్‌ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక హీరోగా మెహబూబాతో పరిచయం అయిన పూరి ఆకాష్ కు ఆ సినిమా నిరాశ మిగిల్చింది. మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ హీరోగా సక్సెస్‌ అవుతాడేమో చూడాలి. ఈ రెండు సినిమాలు మినిమం యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.