Begin typing your search above and press return to search.

పోస్టర్ తో 'ఫిదా' చేసేశారుగా

By:  Tupaki Desk   |   16 Jun 2017 4:01 AM GMT
పోస్టర్ తో ఫిదా చేసేశారుగా
X
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ రూట్ లోనే ఉన్నాడు. మిగిలిన మెగా హీరోస్ మాదిరిగా మాస్ మార్గాన్ని కాకుండా.. క్లాస్ రూట్ నే ఎంచుకున్నాడు. ముకుంద.. కంచె అంటూ థీమ్ బేస్డ్ మూవీస్ తో ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ఆ తర్వాత లోఫర్.. మిస్టర్ లో కాసింత డీలా పడ్డాడు. అయితే.. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఫిదా మాత్రం ముందు నుంచి ప్రామిసింగ్ గానే ఉంది. పోస్టర్లతోనే ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇప్పటికే ఫిదా ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు టీజర్ కోసం ప్రత్యేకంగా పోస్టర్ ను రిలీజ్ చేశాడు. 'ఫిదా టీజర్ తో జూన్ 17న మీ ముందుకు వస్తున్నాం' అంటూ ఓ డిఫరెంట్ పోస్టర్ తో చెప్పాడు వరుణ్ తేజ్. ఓ సోఫా మాదిరి పాత తరం ఉయ్యాల బల్లపై కూర్చున్న హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ సాయి పల్లవి.. ఈ పోస్టర్ లో కనిపిస్తారు. తను పెట్టుకున్న గోరింటాకును సాయిపల్లవి ముద్దుగా చూపిస్తుంటే.. ఆమె చేతుల వంక మురిపెంగా చూస్తున్న వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంటుంది.

హీరోతో పాటు హీరోయిన్ కూడా సింపుల్ లుక్స్ తోనే చంపేసిందని చెప్పాలి. మలయాళ ప్రేమమ్ లో ఎంతటి ఒరిజినల్ లుక్స్ తో ఈ భామ ఆకట్టుకుందో.. ఇప్పుడు ఫిదాలో కూడా అచ్చం అలాగే మెప్పించే అవకాశం కనిపిస్తోంది. చీరకట్టు తనకు నప్పినంతగా మరెవరికీ నప్పదేమో అనిపించే రేంజ్ లో మెరిసిపోతోంది సాయిపల్లవి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/