Begin typing your search above and press return to search.

మెగా డిబేట్.. పారితోషికాల్లో ఎవ‌రెంత‌?

By:  Tupaki Desk   |   18 May 2020 9:16 AM IST
మెగా డిబేట్.. పారితోషికాల్లో ఎవ‌రెంత‌?
X
మెగా వృక్షం నీడలో డ‌జ‌ను మంది స్టార్లు పుట్టుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి-ప‌వ‌న్ క‌ల్యాణ్‌-నాగ‌బాబు-రామ్ చ‌ర‌ణ్ - అల్లు అర్జున్- అల్లు శిరీష్‌- వ‌రుణ్ తేజ్- సాయి తేజ్- నిహారిక‌- క‌ళ్యాణ్ దేవ్- వైష్ణ‌వ్ తేజ్... ఇలా ఆర్డ‌ర్ చాలా పెద్ద‌దే ఉంది. ఇక‌పోతే ఇందులో సీనియ‌ర్ల‌ను మిన‌హాయిస్తే.. చ‌ర‌ణ్ - బ‌న్ని అగ్ర క‌థానాయకుల జాబితాలో ఉన్నారు. ఆ త‌ర్వాత రేస్ లో మాత్రం వ‌రుణ్ తేజ్- సాయితేజ్ పేర్లే వినిపిస్తున్నాయి.

ఆ ఇద్ద‌రూ 2014లో కెరీర్ ప్రారంభించారు. ఇప్ప‌టికే ఆరేళ్ల‌య్యింది. 13 న‌వంబ‌ర్ 2014లో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `పిల్లా నువ్వులేని జీవితం` రిలీజైంది. అలాగే అదే ఏడాది 24 డిసెంబ‌ర్ న వ‌రుణ్ తేజ్ న‌టించిన `ముకుంద` రిలీజైంది. ఈ ఐదారేళ్ల‌లో ఆ ఇద్ద‌రూ సాధించిన ప్రగ‌తి ఎంత‌? పారితోషికంలో ఎవ‌రి స‌త్తా ఎంత‌? అంటే... ఎవ‌రి రేంజు వారికి ఉంది. అయితే రేసులో సాయి తేజ్ ఇటీవ‌ల వెన‌క‌బ‌డ్డాడు. కొన్ని వ‌ర‌స ఫ్లాపులు అత‌డి స్థాయిని తగ్గించాయి. రెండు వ‌రుస హిట్ల (చిత్ర‌ల‌హ‌రి- ప్ర‌తిరోజూ పండ‌గే) త‌ర్వాత నెమ్మ‌దిగా కోలుకున్నాడు.

అయితే వ‌రుణ్ తేజ్ అలా కాదు. ఓవైపు వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేస్తూనే 90శాతం స‌క్సెస్ రేటుతో దూసుకుపోతున్నాడు. కెరీర్ లో ఫిదా- తొలి ప్రేమ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. అందువ‌ల్ల అత‌డు సాయి తేజ్ కంటే పారితోషికం ఎక్కువ అందుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. సాయి తేజ్ 2- 3 కోట్ల రేంజులో ఉంటే.. వ‌రుణ్ తేజ్ మాత్రం పారితోషికంలో 4-5 కోట్ల రేంజులో ఉన్నాడ‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. ఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత వ‌రుణ్ 200 శాతం పెంచి 9-10 కోట్ల మేర డిమాండ్ చేశాడ‌న్న ప్ర‌చారం సాగింది. రెండు వ‌రుస హిట్ల త‌ర్వాత సాయి తేజ్ సైతం 2.5 కోట్ల నుంచి ఒక్క‌సారిగా 5కోట్ల‌కు పెంచాడ‌న్న స‌మాచారం ఉంది. సాయితేజ్ ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సో బెట‌రు` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. వ‌రుణ్ తేజ్ `బాక్స‌ర్` (వీటీ 10)లో న‌టిస్తున్నాడు.