Begin typing your search above and press return to search.

మరో కొత్త బామను పరిచయం చేస్తున్న పూరి

By:  Tupaki Desk   |   12 Jun 2015 10:11 AM IST
మరో కొత్త బామను పరిచయం చేస్తున్న పూరి
X
ఈ తరం దర్శకులలో ఎక్కువమంది కథానాయికలను పరిచయం చేసిన ఏకైక దర్శకుడు పూరి జగన్నాధ్. అవకాశమున్న ప్రతిసారి ఓ కొత్త అందాన్ని వెండి తెరపైకి తీసుకొస్తుంటారు. ఇడియట్ సినిమాతో బొద్దుగుమ్మ రక్షితను పరిచయం చేశారు. పరిచయం చేయడమే కాదు తన తర్వాటి సినిమాలైన శివమణి, ఆంధ్రావాల లోనూ అవకాశాలిచ్చాడు. కానీ ఈ అందం కొద్ది కాలానికే పరిమితమయింది.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తమిళ పొన్ను అసిన్ కు అవకాశమిచ్చారు. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న అనుష్కను కూడా పూరి ఆవిష్కరించిన అందమే. దేశముదురు సినిమాతో హన్సిక, చిరుతకి జతగా నేహా శర్మ, తాజాగా హార్ట్ ఎటాక్ సినిమాలో ఆదా శర్మ ఇలా కొత్త అందాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే వస్తున్నారు పూరి.

తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందనున్న సినిమాలో కూడా మరో హిందీ బామని తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు. నిండా ఇరవై ఏళ్ళు కూడా లేని దిషా పతానిని ఈ సినిమాకు హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఈ అమ్మడు మాత్రం తక్కువేం కాదు. పలు కమర్షియల్ యాడ్స్ లో నటించి కరణ్ జోహార్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ ముంబై బామ మన ముకుందుడి జతగా ఏ మేరకు మెప్పిస్తుందో ...?