Begin typing your search above and press return to search.

వెండితెర ఛాన్సుల‌ కోస‌మేనా యాంక‌ర్ హంగామా?

By:  Tupaki Desk   |   16 April 2021 6:30 AM GMT
వెండితెర ఛాన్సుల‌ కోస‌మేనా యాంక‌ర్ హంగామా?
X
బుల్లితెర యాంక‌ర్ల వ‌రుస‌ ఫోటోషూట్ల హంగామా చూస్తున్న‌దే. అన‌సూయ‌- రేష్మి- శ్రీ‌ముఖి-మంజూష‌ లాంటి యాంక‌ర్లు గ్లామ‌ర్ స‌రిహ‌ద్దుల్ని చెరిపేసి హాట్ ఫోటోషూట్ల‌తో అభిమానులను అల‌రిస్తున్నారు.

ఇదే బాట‌లో మ‌రో బుల్లితెర యాంక‌ర్ వ‌ర్షిణి కూడా ఇటీవ‌ల వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నారు. తాజాగా వ‌ర్షిణి షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ పై ఇన్ స్టా వేదిక‌గా డిబేట్లు ర‌న్ అవుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో అన‌సూయ‌.. రేష్మి త‌ర‌హాలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న యాంక‌ర్ గా వ‌ర్షిణి పేరు మార్మోగుతోంది. తాజాగా ఈ బ్యూటీ నల్ల చీర ఓపెన్ బ్యాక్ బ్లౌజ్ ధరించి తన మేనిఛాయ అందాల్ని ప్ర‌ద‌ర్శించింది. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

వ‌ర్షిణి కెరీర్ సంగ‌తులు చూస్తే.. ఈటీవీ‌2 లో కామెడీ షోలు ఫ‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కార్య‌క్ర‌మాలు స‌హా ప‌లు బుల్లితెర కార్య‌క్ర‌మాల్లోనూ వ‌ర్షిణి క‌నిపిస్తోంది. ఢీ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక‌.. ప్రస్తుతం వర్షిణి సౌందరాజన్‌ స్టార్‌ మాలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` షోకి వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇంత‌కుముందు వ‌ర్షిణి పెద్ద తెర‌పైనా ప్ర‌య‌త్నించింది. మ‌రోసారి టాలీవుడ్ లో వెలుగులు విర‌జిమ్మేందుకు ఈ అమ్మ‌డు రెడీ అవుతోంద‌ట‌.