Begin typing your search above and press return to search.

బొల్లమ్మ మన పిల్ల కాదట

By:  Tupaki Desk   |   20 Nov 2020 5:00 AM IST
బొల్లమ్మ మన పిల్ల కాదట
X
జాను సినిమాతో పాటు ఈమద్య పలు సినిమాల్లో నటిస్తూ వర్ష బొల్లమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వర్ష బొల్లమ్మ అనగానే అంతా కూడా తెలుగు అమ్మాయి అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. ఆమెను చూసినా కూడా తెలుగు అమ్మాయిలా.. పక్కింటి పిల్ల మాదిరిగా ఉంది. కనుక అంతా కూడా ఆమెను తెలుగు అమ్మాయిగానే పరిగణిస్తున్నారు. అయితే తాను తెలుగు అమ్మాయిని కాదు అంటూ వర్ష క్లారిటీ ఇచ్చింది. తనది కర్ణాటకలోని కొడగు అంటూ పేర్కొంది. తెలుగు బాగా మాట్లాడగల తనకు సినిమాలపై చాలా మక్కువ అని... తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ రెండవ సినిమా మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ లో ఈమె హీరోయిన్‌ గా నటించింది. భారీ అంచనాలున్న ఈ సినిమా రేపు అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమా ట్రైలర్‌ లో రౌడీ బ్రదర్‌ కు మంచి జోడీ అన్నట్లుగా అనిపించింది. అందుకే ఈ అమ్మడు ఆ సినిమా కాకుండా మరో రెండు మూడు సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది కనీసం నాలుగు అయిదు సినిమాలు అయినా తెలుగులో ఈమె నటించినవి విడుదల అయ్యే అవకాశం ఉంది. తెలుగు అమ్మాయి కాకపోవడం వల్లే ఈమెకు మరీ ఇంతగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలకు మరీ ఇంతగా ఎలా ఆఫర్లు వస్తాయి చెప్పండి..!