Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ వారసుడి కోసం ‘96’ అమ్మాయి

By:  Tupaki Desk   |   7 Jan 2019 10:45 AM GMT
టాలీవుడ్‌ వారసుడి కోసం ‘96’ అమ్మాయి
X
‘పెళ్లి చూపులు’, ‘మెంటల్‌ మదిలో’ వంటి చిన్న విభిన్న తరహా చిత్రాలను నిర్మించి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు దక్కించుకున్న రాజ్‌ కందుకూరి ఇప్పుడు తన కొడుకు శివను హీరోగా పరిచయం చేసేందుకు సిద్దం అయ్యాడు. తన కొడుకుతో సినిమాను తానే స్వయంగా నిర్మించబోతున్నాడు. తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా సురేష్‌ బాబు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. సురేష్‌ బాబుతో పాటు మధుర శ్రీధర్‌ ను కూడా ఈ చిత్రంలో భాగస్వామిగా రాజ్‌ కందుకూరి చేసినట్లుగా తెలుస్తోంది.

క్రిష్‌ మరియు సుకుమార్‌ ల వద్ద దర్శకత్వ శాఖలో గతంలో సహాయ దర్శకురాలిగా చేసిన శేష సింధు రావు ఈ చిత్రంకు దర్శకత్వం వహించబోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ గా ‘96’ ఫేం వర్ష బొల్లమ్మ ను ఎంపిక చేశారు. గత ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 96 చిత్రంలో వర్ష చిన్న పాత్రను పోషించినా మంచి గుర్తింపు దక్కించుకుంది. తమిళనాట ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకే ఈమెను ఈ చిత్రంకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంకు సంగీతంను ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ అందించనున్నాడు. మహానటికి రచయితగా వర్క్‌ చేసిన పద్మావతి విశ్వేశ్వర్‌ ఈ చిత్రంకు డైలాగ్స్‌ రాయనుండగా, వేద రామన్‌ సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు. ఈ చిత్రంను ఇదే ఏడాది విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.