Begin typing your search above and press return to search.
ట్రైలర్: అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ఏది?
By: Tupaki Desk | 9 Jan 2019 7:59 PM ISTఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాని ఒరిజినల్ ఎస్సెన్స్ చెడకుండా మళ్లీ అంతే గ్రిప్పింగ్ గా తెరకెక్కించడం అంటే అదో పెద్ద సవాల్. `అర్జున్ రెడ్డి` లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాని తిరిగి రీమేక్ చేయాలంటే చాలానే గట్స్ ఉండాలి. అయినా ఈ చిత్రాన్ని తమిళ్, హిందీలో రీమేక్ చేస్తూ చాలానే గట్స్ చూపిస్తున్నారు మేకర్స్. హిందీ అర్జున్ రెడ్డి మాటేమో గానీ, తమిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా జాతీయ అవార్డ్ గ్రహీత బాలా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని `వర్మ` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇదివరకూ రిలీజైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. ధృవ్ డెబ్యూ సినిమాగా ఇలాంటి ఇంటెన్స్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు కాబట్టి, అతడికి అది పెద్ద ప్లస్ కానుంది. ధృవ్ కి నటించేందుకు హై రేంజులో స్కోప్ ఉంది. తండ్రికి తగ్గ వారసుడిగా ధృవ్ లుక్స్ గురించి పేరు పెట్టాల్సిన పనేలేదు.
జూనియర్ చియాన్ లక్ చెక్ చేసుకునేందుకు ఇంకెంతో టైమ్ లేదు. తాజాగా వర్మ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఎలా ఉంది? మాతృకతో పోలిస్తే అంత గ్రిప్పింగ్ గా ఈ సినిమాని తీశారా? అంటే .. ట్రైలర్ వరకూ ఏమంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఒరిజినల్ సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ ని ఆ స్థాయిలో చూపించలేదనే అర్థమవుతోంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి గా టైటిల్ పాత్రధారి విజయ్ దేవరకొండ చూపించినంత ఎమోషన్ ని చూపించగలుగుతారా? అన్నది సందేహమే. ముఖ్యంగా లవ్ లో ఎమోషన్, విరహంలో ఉక్రోశం, రగ్గ్ డ్, బోల్డ్ సన్నివేశాలు ఈ చిత్రంలోనూ యథాతథంగానే చూపిస్తున్నా.. అంత డీప్ ఇంటెన్సిటీ కనిపించడం లేదు. ఎమోషన్స్ ని మ్యానేజ్ చేయడంలో డెబ్యూ హీరో ధృవ్ ఫర్వాలేదనిపించాడు. అయితే ట్రైలర్ ని తీర్చిదిద్దిన తీరు ఒరిజినల్ రేంజులో మెప్పించలేకపోయింది. ఆ స్థాయిలో బోల్డ్ కంటెంట్ ని జొప్పించడంలో తీవ్రమైన ఎమోషన్, ఉద్రేకం, ఉద్రిక్తత వంటి వాటిని సరిగ్గా ఇన్ కార్పొరెట్ చేడయంలో విఫలమయ్యారనే ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
దేవరకొండతో పోలిస్తే ధృవ్ వయసు పరంగానూ ఇంకా టీనేజీ బోయ్ లా కనిపించడం ఓ మైనస్ అనే చెప్పాలి. ఇక ఓంకారం, శివపుత్రుడు, వాడు వీడు, నేను దేవుణ్ణి లాంటి ఎమోషనల్ డీప్ ఇంటెన్స్.. రగ్గ్ డ్ ఎంటర్ టైనర్లను తెరకెక్కించిన బాలా `వర్మ` చిత్రానికి దర్శకత్వం వహించడం ప్లస్ అనుకుంటే, ట్రైలర్ వరకూ ఎందుకు కంటెంట్ ని తగ్గించారు? అన్నది అర్థం కాని పరిస్థితి. చూద్దాం సినిమా రిలీజైతే జనం స్పందన ఎలా ఉంటుందో? `వర్మ` చిత్రం త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది