Begin typing your search above and press return to search.

వందకోట్ల క్లబ్ లో పొంగల్ మూవీస్

By:  Tupaki Desk   |   16 Jan 2023 2:30 AM GMT
వందకోట్ల క్లబ్ లో పొంగల్ మూవీస్
X
కోలీవుడ్ లో పండగ రేసులో ఈ సారి స్టార్ హీరోలైన అజిత్, విజయ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది. అలాగే ఫ్యాన్స్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయిలో ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ ఉంటుంది. ఈ నేపధ్యంలో తునివు సినిమాతో అజిత్,వారిసు మూవీతో విజయ్ ఈ పొగల్ రేసులో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఈ రెండు సినిమాలు ఒకే సారి జనవరి 11న కోలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. అలాగే పాన్ ఇండియా లెవల్ లో ఈ ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ కావడం విశేషం. అజిత్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తే, విజయ్ వారిసు మూవీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రెండు దశాబ్దాల తర్వాత ఇళయదళపతి విజయ్ నుంచి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం విశేషం.

ఇక ఈ రెండు సినిమాలకి మొదటి రోజు నుంచి ఎవరేజ్ టాక్ వచ్చింది. తునివుతో పోల్చుకుంటే వారిసుకి కాస్తా బెటర్ రెస్పాన్స్ రావడం విశేషం. ఇదిలా ఉంటే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ రెండు సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పెద్ద హీరోల సినిమాలు కావడంతో ఫ్యామిలీతో వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా ఈ సినిమాల కలెక్షన్స్ కోలీవుడ్ లో భాగానే ఉంది.

ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయిన తర్వాత లాంగ్ రన్ లో ఎన్ని రోజులు బజ్ ని కొనసాగిస్తూ కలెక్షన్స్ రాబడుతుంది అనేది మూవీ ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలకి వస్తున్న ప్రేక్షకాదరణ చూస్తుంటే ఈ రెండు సినిమాలు వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం అయితే పక్కా అనే మాట వినిపిస్తుంది. అయితే ఈ హీరోల గత సినిమాలని బీట్ చేసే విధంగా కలెక్షన్స్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.