Begin typing your search above and press return to search.

వారసుడు.. దిల్ రాజు తొలి టార్గెట్!

By:  Tupaki Desk   |   23 Nov 2022 3:30 PM GMT
వారసుడు.. దిల్ రాజు తొలి టార్గెట్!
X
వారసుడు సినిమాలో ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ ఊహించిన విధంగా ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహర్షి సినిమా తర్వాత కమర్షియల్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరపైకి తీసుకువస్తున్న ఈ సినిమాపై తమిళంలో అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇక తెలుగులో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుంది అనేది ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేవరకు ఎవరు చెప్పలేరు.

ఈ సినిమా తమిళ సినిమా అంటూ మొదట బాగానే ప్రచారాలు చేశారు. ఆ మధ్య నిర్మాతల స్ట్రైక్ కొనసాగినప్పటికీ కూడా సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేశాడు. ఇక ఇప్పుడు అదే ఈ సినిమాకు ఇబ్బందిగా మారింది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతుండడంతో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేది లేదు అని నిర్మాతలు చెబుతున్నారు.

అయితే తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు అనుకుంటే తనకు నచ్చిన సినిమాలను నచ్చిన ధియేటర్లలో విడుదల చేయించే సత్తా అయితే ఉంది. ఇక వారసుడు సినిమాను కూడా అదే రేంజ్ లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఎంత మాత్రం రిస్క్ తీసుకోకుండా దాదాపు సంక్రాంతికి తీసుకురావచ్చు అని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు తన ఆధ్వర్యంలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని వారసుడు సినిమాను మినిమం థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

తొలిరోజు టార్గెట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 10 కోట్ల షేర్ వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో విడుదల చేయకపోతే నిర్మాతగా కొంత నష్టాలు ఎదుర్కొక తప్పదు.

ఇక దిల్ రాజుకి నైజాం ఏరియాలోనే కాకుండా ఆంధ్ర ఏరియాలలో కూడా చాలా థియేటర్లో ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి వారసుడు సినిమా కోసం ఇప్పటినుంచి మెయిన్ థియేటర్స్ ను బుక్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి వారసుడు సినిమా దిల్ అంచనాల ప్రకారం ఓపెనింగ్స్ అందుకుంటుందో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.