Begin typing your search above and press return to search.

యశోద తో జాయిన్ అయిన జయమ్మ

By:  Tupaki Desk   |   16 Dec 2021 6:34 AM GMT
యశోద తో జాయిన్ అయిన జయమ్మ
X
తెలుగు ప్రేక్షకులను రవితేజ క్రాక్‌ సినిమాలో జయమ్మ గా నటించి మెప్పించిన తమిళ ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్‌ కుమార్ మరో తెలుగు సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యింది. ఇటీవలే సమంత హీరోయిన్ గా ప్రారంభం అయిన యశోద సినిమా లో ఈమె కనిపించబోతుంది. హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రలను చేసేందుకు సిద్దం అవ్వడం అభినందనీయం. నటనపై ఆమెకు ఉన్న ప్యాషన్ తో ఎలాంటి పాత్రలను అయినా ఛాలెంజ్ గా తీసుకుని చేస్తూ ఉంటుంది. తెలుగు లో ఆమె నాంది సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది. వరలక్ష్మి తెలుగు లో నటించిన సినిమాలు అన్ని కూడా మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి.

యశోద సినిమాలో మధుబాల అనే పాత్రలో వరలక్ష్మి కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. బహు బాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక వైపు సమంత మరియు మరో వైపు వరలక్ష్మితో పాటు పలువురు ప్రముఖ నటీ నటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. శివలెంకల కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీష్ నారాయన్‌ మరియు హరి శంకర్ లు దర్శకత్వం వహిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను భారీ పాన్ ఇండియా మూవీగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

తెలుగు.. కన్నడం.. మలయాళం.. తమిళం.. హిందీల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా షూటింగ్‌ ప్రారంభించిన రోజే యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సమంతకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ఈ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో సమంత పాత్ర ఏంటా అంటూ ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉన్నారు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే శాకుంతలం అనే ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీని చేసిన సమంత ఇప్పుడు యశోద అనే సినిమాను చేస్తోంది. శాకుంతలం మరియు యశోద టైటిల్‌ చాలా పవర్ ఫుల్‌ గా తెలుగు వారికి చాలా రిలేటెడ్‌ గా ఉండటం వల్ల సినిమాపై అంచనాలు ఆసక్తి కలుగుతోంది.