Begin typing your search above and press return to search.

విలన్‌ గా కాదు ఈసారి హీరోయిన్‌ గా రానుంది

By:  Tupaki Desk   |   16 Jun 2020 1:40 PM IST
విలన్‌ గా కాదు ఈసారి హీరోయిన్‌ గా రానుంది
X
తమిళంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించి మెప్పించిన స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ టాలీవుడ్‌ లో కూడా పలు చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. అయితే తెలుగులో ఈమె హీరోయిన్‌ గా కాకుండా విలన్‌ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తోంది. తమిళనాట పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేస్తూ హీరోయిన్‌ ఛాన్స్‌ ల కోసం ఎదురు చూడకుండా ముందుకు సాగుతున్న వరలక్ష్మి కి తెలుగులో అంతంత మాత్రంగా ఆఫర్లు వచ్చాయి.

ఇటీవల గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్‌ చిత్రంలో కూడా ఈమెకు ఛాన్స్‌ వచ్చిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కూడా ఏ విలన్‌ గానో లేదంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానో ఆమె కనిపించబోతుందేమో అనుకున్నారు. కాని ఈసారి వరలక్ష్మి హీరోయిన్‌ గా కనిపించబోతుంది. రవితేజకు జోడీగా వరలక్ష్మి ఆడి పాడబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా ఇప్పటికే శృతి హాసన్‌ నటిస్తోంది. అయినా కూడా వరలక్ష్మి హీరోయిన్‌ గానే కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తెలుగులో మొదటి సారి హీరోయిన్‌ గా కనిపించబోతున్న వరలక్ష్మి క్రాక్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. షూటింగ్‌ దాదాపుగా పూర్తి చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత విడుదల చేయాలని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే బ్యాలన్స్‌ ఉన్న పార్ట్‌ ను షూట్‌ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.