Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఏంటి రాజా ఇది
By: Tupaki Desk | 1 Dec 2018 1:32 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా టాప్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అత్తారింటికి దారేది గురించి ఫ్యాన్స్ కు ఎన్ని సంగతులు చెప్పినా మైమరిచి వింటూనే ఉంటారు. త్రివిక్రమ్ మాటల మాయజాలం దర్శకత్వపు ప్రతిభ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వెరసి సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. పైరసీ రక్కసి వేధించినా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. ఇప్పుడు దీని తమిళ రీమేక్ రెడీ అవుతోంది. శింబు హీరోగా వంత రాజవతాన్ వరువేన్ పేరుతో దీని షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. వరసగా 2.0 లాంటి భారీ బడ్జెట్ క్రేజీ మూవీస్ నిర్మిస్తున్న లైకా సంస్థనే దీనికి ప్రొడ్యూసర్ కావడం విశేషం. సుందర్ సి దర్శకుడు. రజనికాంత్ అరుణాచలంతో పాటు ఆ మధ్య తెలుగులో కూడా బాగానే ఆడిన చంద్రకళ దర్శకుడు ఈయనే.
దీని ట్రైలర్ ఇందాకే విడుదల చేసారు. ఒరిజినల్ ఫీల్ ని పూర్తిగా జీరో చేసేలా సుందర్ సి టేకింగ్ కథలోనే ఆత్మను బాగా దెబ్బ తీసేలా ఉందనిపిస్తోంది. టేకింగ్ పరంగా చూస్తే మక్కికి మక్కి తీసినట్టే అనిపిస్తున్నా క్వాలిటీలో పడిన రాజీతో పాటు ఆర్టిస్టుల కాంబినేషన్ కూడా తేడా కొట్టడంతో కొంపదీసి ఇది బ్యాడ్ రీమేక్ గా నిలవదు కదా అనే అనుమానం కలిగిస్తోంది. సమంతా ప్లేస్ లో మేఘా ఆకాష్-ప్రణీతగా క్యాథరిన్ త్రెస్సా-నదియాగా రమ్యకృష్ణ-బోమన్ ఇరానీగా నాజర్-రావు రమేష్ గా ప్రభు ఇలా అందరు మనకు తెలిసిన కాస్టింగ్ కావడం విశేషం.
శింబు బాగా ఒళ్ళు చేసాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ అది స్పష్టంగా కనిపిస్తోంది. పైగా సుందర్ సి సన్నివేశాలన్నీ తెలుగువే ఎలాంటి మార్పు లేకుండా కాపీ కొట్టినప్పటికీ దాని తాలుకు ఒరిజినాలిటీ మాత్రం దాదాపు మిస్ అయ్యింది. శింబు ఫ్యాన్స్ కి ఇది పక్కా ఊర మాస్ మసాలా సినిమా అనే ఫీలింగ్ కలిగేలా ట్రైలర్ కట్ చేయడం మరో విశేషం. ధృవ -కృష్ణార్జున యుద్ధం ఫేం హిప్ హాప్ తమిజా దీనికి మ్యూజిక్ డైరెక్టర్. కన్నడలో సుదీప్ హీరోగా మంచి మేకింగ్ తో హిట్ అయిన ఈ రీమేక్ తమిళ్ లో మాత్రం ఆ స్థాయి మేజిక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.