Begin typing your search above and press return to search.
సౌమ్య సేతుపతికి ఆమె ఎవరో తెలీదట.. ప్చ్!
By: Tupaki Desk | 29 May 2023 10:30 AM ISTఇటీవలి కాలంలో సీనియర్ నరేష్ - పవిత్ర అనుబంధం గురించి యువతరంలో ఎక్కువగా చర్చ సాగుతోంది. అదే క్రమంలో మళ్లీ పెళ్లి అనే సినిమాలో ఈ జంట నటించడం.. ఇది నరేష్ నిజ జీవిత కథతో తెరకెక్కినది అంటూ ప్రచారం సాగడం తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రను కూడా చూపించారు. ఈ పాత్రను వనిత విజయ్ కుమార్ పోషించారు.
అయితే నిజ జీవిత పాత్రలో నటించే ముందు అందుకు అవసరమైన రిఫరెన్సులు ఏవైనా దర్శకుడి నుంచి తీసుకున్నారా? అని ప్రశ్నించగా వనిత ఇచ్చిన జవాబు షాకిస్తోంది.
తనకు రమ్య రఘుపతి అంటే ఎవరో తెలీదని సౌమ్య సేతుపతి మాత్రమే తెలుసునని వనిత వెల్లడించారు. అసలు ఆమె ఎవరో కూడా తనకు ఏనాడూ తన దర్శకుడు ఎం.ఎస్.రాజు చెప్పనేలేదని అన్నారు.
ఎక్కువగా ఏడవొద్దు. అతిగా నటించొద్దు. మేకప్ లేకుండా సహజంగా తెరపై కనిపించు! అని మాత్రమే తనకు సూచించారని ప్రతిరోజూ ఇంగ్లీషులో తన సీన్లు రాసి పంపిస్తే వాటిని ప్రిపేర్ అయ్యి చేసేసేదానిని అని వనిత వెల్లడించారు. తనకు తెలుగు చదవడం రాకపోవడం వల్ల నే అలా చేసేవారట.
ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందని చెప్పారు కానీ ఫలానా అమ్మాయి నిజ జీవత పాత్ర అని అస్సలు వెల్లడించలేదని తెలిపారు. తనకు ఎలాంటి రిఫరెన్సులు ఇవ్వలేదని కూడా తెలిపారు.
మళ్లీ పెళ్లి సినిమాలో వనిత పోషించిన సౌమ్య సేతుపతి పాత్రకు మంచి స్పందన దక్కింది. ప్రతినాయక ఛాయలున్న పాత్ర అయినా కానీ ఈ పాత్రను పవర్ ఫుల్ గా చూపించారని వనిత అంటున్నారు.