Begin typing your search above and press return to search.

రాంగోపాల్ వర్మకు కొత్త పేరు.. పకోడీగాడు

By:  Tupaki Desk   |   26 Dec 2016 7:03 AM GMT
రాంగోపాల్ వర్మకు కొత్త పేరు.. పకోడీగాడు
X
రచ్చ చేసుకోవడంలో నంబర్ 1 ఎవరైనా ఉన్నారా అంటే అది రాంగోపాల్ వర్మే అని చెప్పాలి. తాజాగా ఆయన పొలిటికల్ క్రైం స్టోరీ వంగవీటి సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అనౌన్సు చేసినప్పటి నుంచే వివాదాలు ముసురుకున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ తరువాత కూడా వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వంగవీటి రంగా కుమారుడు రాధా మొదటి నుంచి హెచ్చరిస్తునే ఉన్నారు. తాజాగా ఆయన... వర్మపై మరోసారి విరుచుకుపడ్డారు. వంగవీటి సినిమాలో రంగాను - కాపులను రౌడీలుగా చూపించడంపై రాధా తీవ్రంగా స్పందించారు.

రాధా.. వర్మను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. గొట్టం గాడు.. వేస్టుగాడు.. యూస్ లెస్ ఫెలో.. పకోడీ గాడు.. ఇలా కామెడీ తిట్లన్నీ తిట్టేశారు. రంగాను కించపరిచిన ప్రతి ఒక్కడూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేశారు. ‘‘వర్మ యూస్‌ లెస్‌ ఫెలో” అని తిట్టారు. ‘‘ఎవడో పకోడిగాడు సినిమా తీశాడు. ఎవడిదో వాడికి రుచిగా ఉంటే వాడువాడు చూసుకోమనండి. వంగవీటి అన్నది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌ ను వాడుకుని డబ్బు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగాను చంపిన వారిని గొప్పగా చూపించి నెత్తుటి కూడు తినాలనుకుంటున్నారు. నిజంగా డబ్బుకు అంత కక్కుర్తి ఉంటే అడిగితే రంగా అభిమానులంతా వాడి ముఖాన చిల్లర పడేస్తారు. ఆ డబ్బుతో జీవితాంతం బతకొచ్చు’’ అని అన్నారు.

రంగా ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారో కూడా తెలియని యూస్‌ లెస్‌ ఫెలోగాడు సినిమా తీశాడంటూ వర్మను ఏకిపడేశాడు. రంగాను ఎవరు చంపారన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని.. దీనిపై ఏం చేయాలో తనకు బాగా తెలుసని.. మూల్యం చెల్లించుకోకతప్పదని వార్నింగ్ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/