Begin typing your search above and press return to search.

ప‌్ర‌ముఖుల ఇళ్ల‌కే వెళ్తున్న వంగ‌వీటి

By:  Tupaki Desk   |   22 Dec 2016 4:53 PM GMT
ప‌్ర‌ముఖుల ఇళ్ల‌కే వెళ్తున్న వంగ‌వీటి
X
రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం ‘వంగ‌వీటి’పై మొద‌ట్నుంచీ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా మొద‌ట్నుంచీ ఎంతో ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌తో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక సినిమాని నిత్యం వార్త‌ల్లో ఉంచుతూ ప‌బ్లిసిటీ ఎలా చేసుకోవ‌డ‌మే వ‌ర్మ‌కు బాగా తెలుసు. అందుకే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ను హైద‌రాబాద్ లో భారీ ఎత్తున నిర్వ‌హించారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేసి రాజ‌కీయ‌, సినీ రంగ ప్ర‌ముఖుల‌కు ప్ర‌త్యేక షోలు ఏర్పాటు కూడా వేయిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌కు ‘వంగవీటి’ సినిమా ప్ర‌త్యేక షోల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ వారివారి క్యాంపు కార్యాల‌యాల్లోనే ఈ చిత్రాన్ని చూస్తార‌న్న‌మాట‌. వీరితోపాటు మ‌రో ఐదుగురు ప్ర‌ముఖ నాయ‌కులు కోసం కూడా స్పెష‌ల్ షోలు ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లూ భారీ ఎత్తున పూర్తి చేసిన‌ట్టు చెబుతున్నారు. తెలంగాణ‌కుచెందిన తెలుగుదేశం నాయ‌కుడు రేవంత్ రెడ్డితోపాటు ప‌లువురు నేతలు కూడా ఈ ప్ర‌త్యేక షోలు చూస్తున్నారు.

ఇక‌, సినీరంగ ప్ర‌ముఖుల విష‌యానికొస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ లు కూడా వంగ‌వీటి స్పెష‌ల్ షోస్ చూస్తున్నారు. ఎవ‌రి ఇంట్లో వారే కూర్చుని సినిమా చూసే ఏర్పాట్లు చేశారు. ప్ర‌త్యేకంగా వారి ఇళ్ల‌ల్లోనే తెర‌లు ఏర్పాటు చేసుకుని ప్ర‌ద‌ర్శ‌న‌కు వీలుగా క్యూబ్ ఏర్పాట్లు చేశారు. ఇక‌, వీరితోపాటు విజ‌య‌వాడ ప్రాంతంతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన కొంత‌మంది ప్ర‌ముఖ సామాజిక వ‌ర్గాల నేత‌ల‌కు కూడా ప్ర‌త్యేక షోలు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి, వంగవీటి చిత్రాన్ని ఈ రేంజిలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ.. భారీ అంచ‌నాలు క‌ల్పిస్తున్నారని చెప్పాలి.