Begin typing your search above and press return to search.

నో చెప్పిన వంగవీటి వైఫ్??

By:  Tupaki Desk   |   27 Feb 2016 7:30 PM GMT
నో చెప్పిన వంగవీటి వైఫ్??
X
ఒక్క సినిమాతో ఎంత రచ్చ చేయచ్చో, హడావిడి చేసి ఎంతగా హంగామా చేయచ్చో, తన మూవీకి హైప్ క్రియేట్ చేసుకోవచ్చో.. మొత్తం చేసి చూపిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే బెజవాడలో ఉన్న ఆకు రౌడీలకు నా కౌంటర్ సవాల్ అని ట్విట్టర్ సాక్షిగా తిట్టిపోసేసి.. విజయవాడలో అడుగుపెట్టిన వర్మకు అక్కడ ఘనస్వాగతమే లభించింది. బెజవాడలో వర్మ కాలు కదిపితే చాలు వార్త అయిపోతోంది.

వంగవీటి సినిమాకోసం ఆ స్టోరీకి సంబంధించిన వ్యక్తులతో కలిసేందుకే వర్మ విజయవాడ వచ్చాడు. ఇప్పటికే దేవినేని నెహ్రూ సహా పలువురిని కలిశాడు కూడా. కానీ ఈ స్టోరీలో చాలా కీలకమైన పాత్ర వంగవీటి రంగా సతీమణి రత్నకుమారికి ఉంటుంది. మాట్లాడేందుకు సమయం కావాలని అడిగించాడట ఈ దర్శకుడు. కానీ రత్నకుమారి మాత్రం.. రామ్ గోపాల్ వర్మతో మాట్లాడేందుకు ఏం లేదని.. అసలు మాట్లాడబోనని చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో తన సినిమాలోని ఓ ఇంపార్టెంట్ కేరక్టర్ కి సంబంధించిన నిజ జీవిత వ్యక్తితో కలిసే అవకాశం.. ఈ దర్శకుడికి లభించనట్లే.

ఇదిలా ఉంటే.. నేనే దేవుడిని, నేను ఏ దేవుడినీ నమ్మను అంటూ ఓ కాలేజ్ ఈవెంట్ లో వర్మ చెప్పుకొచ్చాడు. ఒకవేళ యముడు వచ్చి పీకమీద కత్తిపెట్టి, భక్తి సినిమా తీయమని చెప్పినా కూడా తీయనన్నాడు వర్మ.