Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ డైరెక్టర్.. రెంటికీ చెడ్డాడు

By:  Tupaki Desk   |   19 Jun 2016 11:15 AM GMT
సూపర్ హిట్ డైరెక్టర్.. రెంటికీ చెడ్డాడు
X
ఈ ఏడాది తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీస లో ‘ఊపిరి’ ఒకటి. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’కు రీమేకే అయినప్పటికీ.. దీన్ని ఇండియనైజ్ చేసి.. తెలుగు-తమిళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు వంశీ పైడిపల్లి. దర్శకుడిగా ఇప్పటికే అతడి ఖాతాలో హిట్లు ఉన్నాయి కానీ.. ‘ఊపిరి’ అతడికి తెచ్చిపెట్టిన రెస్పెక్ట్ మాత్రం వేరు. ఈ సినిమాతో వంశీ టాప్ లీగ్ డైరెక్టర్ల లిస్టులోకి చేరాడు. చాలామంది అతడితో పని చేయడానికి ఆసక్తి చూపించారు. ఐతే అనుకోని కారణాలతో తన తర్వాతి సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేని గందరగోళంలో పడిపోయాడు వంశీ. ముందు అతను నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రేపో మాపో ప్రకటన వస్తుందనుకుంటుండగా.. అఖిల్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి అతడికి టాటా చెప్పేశాడు వంశీ.

ఐతే తన దగ్గర మహేష్ బాబుకు సరిపోయే సబ్జెక్ట్ ఉండటంతో ధీమాగా ప్రిన్స్ ను కలిసిన వంశీకి ముందు అంతా సానుకూలంగానే కనిపించింది. ‘బ్రహ్మోత్సవం’ పూర్తవుతున్న దశలో ఈ ప్రాజెక్టుపై బాగానే ఆసక్తితో ఉన్నాడు మహేష్. స్క్రిప్టు మరింత డెవలప్ చేయమని కూడా చెప్పాడట. కానీ ‘బ్రహ్మోత్సవం’ విడుదలయ్యాక రిజల్ట్ చూసి డీలా పడిపోయిన మహేష్.. వంశీతో ఇప్పట్లో సినిమాలో చేసేలా కనిపించట్లేదట. వేరే కమిట్మెంట్లు కూడా చాలా ఉండటంతో ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వంశీ నిర్ణయంతో హర్టయిన అఖిల్.. వేరే దర్శకుల వైపు చూస్తున్నాడు. తిరిగి అతడితో సినిమా కోసం వంశీ ట్రై చేసే పరిస్థితి లేదు. మిగతా స్టార్ హీరోలందరూ ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వంశీ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.