Begin typing your search above and press return to search.

'ఊపిరి' సినిమా రీమేక్‌ కాదంటగా!!

By:  Tupaki Desk   |   12 March 2016 10:30 PM GMT
ఊపిరి సినిమా రీమేక్‌ కాదంటగా!!
X
మార్చి 25న వచ్చే 'ఊపిరి' సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు టీమ్‌ అంతా. కింగ్‌ నాగార్జున అయితే మరోసారి సోగ్గాడే చిన్ని నాయనా టైపులో సైలెంటుగా వచ్చి వైబ్రెంట్‌ హిట్‌ కొడతానని ఆశిస్తున్నాడు. ఇక తమన్నా అండ్‌ కార్తీ కూడా హిట్‌ మీద బీభత్సమైన నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసినట్లు తెలుస్తోంది.

అసలు ఊపరి సినిమా ఫ్రెంచ్‌ మూవీ 'ది ఇన్‌ టచబుల్స్‌' సినిమాకు రీమేక్‌ కాదు.. ఇదొక అడాప్షన్‌ (అనుసరణ) మాత్రమే అన్నాడట. ఛ నిజమా? ఒక వర్క్‌ ఏదైనా కూడా.. కేవలం పేపర్‌ మీద ఒక స్టోరీగానో.. ఒక నవలగానో.. లేదా వార్తల్లో ఒక వ్యక్తి జీవితంగానో ఉందనుకోండి.. దానిని మనం సినిమా తీశాం అనుకోండి.. దానినే అడాప్షన్‌ అంటారు. అంతేకాని ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ దాదాపు 85% సీన్లను తీసేసి.. అందులో కాసింత మార్పులు చేస్తే.. అది రీమేక్‌ అవుతుంది కాని అనుసరణ ఎలా అవుద్ది?

నిజానికి ఫ్రెంచ్‌ లో వచ్చిన ఒరిజినల్‌ సినిమాలో కూడా పారాప్లజిక్‌ అయిన తన బాస్‌ కాళ్ళపై వేడినీళ్లు పోసి.. అతడి కాళ్ళు పనిచేస్తున్నాయో లేదో అతగాడి అసిస్టెంట్‌ తెలుసుకునే సీనుంది. దీనిని తెలుగులో కూడా యాజిటీజ్‌గా తీసి ట్రైలర్‌ లో కూడా పెట్టారు. అయితే.. ఈ సీన్‌ ఒరిజనల్‌ గా ఎవరి జీవితం మీద ఆధారపడి ఆ సినిమా తీశారో.. వారి జీవితంలో మాత్రం జరగలేదు. ఒకవేళ ''ఊపిరి'' అడాప్షన్‌ అయ్యుంటే.. ఆ సీన్‌ సినిమాలో పెట్టకూడదు మరి.. రీమేక్‌ కాబట్టి దాన్ని కూడా యాజిటీజ్‌ గా దించేశారు.