Begin typing your search above and press return to search.

మహేష్ కోసం అమెరికా వెళ్తున్నావా??

By:  Tupaki Desk   |   4 July 2017 4:12 AM GMT
మహేష్ కోసం అమెరికా వెళ్తున్నావా??
X
మహేష్ బాబు లేటెస్ట్ మూవీపై రీసెంట్ గానే ఓ అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తయిపోయిందని.. రెండు పాటలను మాత్రమే పిక్చరైజ్ చేయాల్సి ఉందని.. సెప్టెంబర్ 27ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్నామని చెప్పేశారు మురుగదాస్ టీం. స్పైడర్ ను దసరాకు తెస్తున్న మహేష్.. ఇప్పటికే కొరటాలతో సినిమాను ప్రారంభించేయగా.. ఇది సంక్రాంతికి విడుదల కానుంది.

ఆ తర్వాత వంశీ పైడిపల్లితో తన 25వ చిత్రం చేయనున్నాడు మహేష్. ఇప్పటికే స్టోరీ ఫైనల్ అయిపోగా.. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చక్కబెట్టేస్తున్నాడు దర్శకుడు. అల్లు అర్జున్ డీజే లో తన అందాలతో మెప్పించిన పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలని నిర్ణయించుకున్నాడు వంశీ. కొరటాల శివ చిత్రాన్ని మహేష్ పూర్తి చేసేనాటికి.. అన్ని పనులు పూర్తి చేసేసి.. వెంటనే తన ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేసుకున్నాడట ఈ డైరెక్టర్.

ఈ మూవీ బ్యాక్ డ్రాప్ అమెరికా కావడంతో.. అక్కడి రియల్ లొకేషన్స్ ఆధారంగానే సన్నివేశాలను రాసుకోనున్నారట. అందుకే.. తన రైటింగ్ టీంతో కలిసి వంశీ యూఎస్ ప్రయాణం కట్టాడని తెలుస్తోంది. త్వరలోనే అమెరికా బయల్దేరనున్న వీరు.. అక్కడే మూవీ రైటప్ ను పూర్తి చేసి., బౌండ్ స్క్రిప్ట్ తో ఇండియా వస్తారని తెలుస్తోంది. తెలుగు.. తమిళ్ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్.. దిల్ రాజు ఉమ్మడిగా నిర్మిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/