Begin typing your search above and press return to search.

వంశీకి మరో ఆప్షన్‌ లేదు అప్పటి వరకు ఆగాల్సిందే

By:  Tupaki Desk   |   4 Sept 2020 9:30 AM IST
వంశీకి మరో ఆప్షన్‌ లేదు అప్పటి వరకు ఆగాల్సిందే
X
ఈమద్య కాలంలో దర్శకులు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లు దక్కించుకున్నా కూడా ఏళ్లకు ఏళ్లు ఆగాల్సిన పరిస్థతి అనుకోకుండా వచ్చేస్తోంది. సుకుమార్‌ 'రంగస్థలం'.. కొరటాల శివ 'భరత్‌ అనే నేను' చిత్రాల తర్వాత కొత్త సినిమాలను ఇప్పటి వరకు విడుదల చేయలేక పోయారు. ఈమద్యే వీరు కొత్తలు చేస్తున్నారు. సుకుమార్‌ పుష్ప ప్రకటించినా ఇంకా మొదలు పెట్టలేదు. ఈ ఇద్దరు దర్శకులకు దాదాపు రెండేళ్లకు పైగా గ్యాప్‌ వచ్చింది. సినిమాలు విడుదల అయ్యేప్పటికి మూడేళ్లు కూడా అవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థతి మరో దర్శకుడు వంశీ పైడిపల్లికి ఎదురవుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఈయన మహేష్‌ బాబు 25వ సినిమా మహర్షి ని తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మహేష్‌ కెరీర్‌ లో నిలిచి పోయే సినిమాల్లో అది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు వంశీ ఇప్పటి వరకు తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఆ సినిమా తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. సర్కారు వారి పాట తర్వాత అయినా మహేష్‌ బాబు వంశీకి డేట్లు ఇస్తాడేమో చూడాలి.

మహేష్‌ బాబుతో సినిమా తప్పడంతో రామ్‌ చరణ్‌ కు వంశీ కథ వినిపించడం దిల్‌ రాజు నిర్మించేందుకు ముందుకు రావడం వంటివి జరిగాయి. కాని రామ్‌ చరణ్‌ పలు సిట్టింగ్స్ తర్వాత కాస్త సమయం కావాలంటూ అడిగాడట. దాంతో మరే స్టార్‌ హీరో కూడా ఖాళీ లేకపోవడంతో వంశీ మరో ఏడాది పాటు ఆగాల్సి రావచ్చు అంటున్నారు. మహేష్‌ తో సినిమా క్యాన్సిల్‌ అయినా ఆయనతో సన్నిహిత్యం మాత్రం వంశీకి ఉంది. అందుకే మళ్లీ మహేష్‌ వద్దకే వంశీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రాజమౌళితో సినిమాకు ముందు రెండు మూడు సినిమాలు చేయాలనుకుంటున్న మహేష్‌బాబు అందులో ఒకదానికి వంశీకి ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మహేష్‌ కాకుండా మరే హీరోత చేయాలన్నా కూడా వంశీ చాలా కాలం వెయిట్‌ చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.