Begin typing your search above and press return to search.

మహర్షికీ అలానే జరుగుతోదంట!

By:  Tupaki Desk   |   24 Nov 2018 6:02 AM GMT
మహర్షికీ అలానే జరుగుతోదంట!
X
మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బడ్జెట్ గురించి సినీ వర్గాలలో రీసెంట్ గా ఓ టాక్ వినిపిస్తోంది. సహజంగానే మహేష్ బాబు సినిమాలకు బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. 'మహర్షి' బడ్జెట్ కూడా అలానే ఉంది. కానీ ముందుగా ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే ఎక్కువైపోతోందని అంటున్నారు.

అమెరికాలో లాంగ్ షెడ్యూల్స్.. వర్కింగ్ డేస్ కూడా ఎక్కువగా ఉండడం.. భారీ సెట్ల నిర్మాణం లాంటి వాటితో ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిందట. ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉండడంతో ఒకరు స్ట్రిక్ట్ గా బడ్జెట్ ను మానిటర్ చేయలేకుండా ఉన్నారట. దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలతో భారీగా ఖర్చు పెట్టిస్తాడనే టాక్ ఉంది. వంశీ లాస్ట్ సినిమా 'ఊపిరి' విషయంలో అలా జరగడం వల్లే మంచి పేరు వచ్చినా నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. కాస్ట్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. ఇప్పుడు మళ్ళీ వంశీ అదే రూట్ లో వెళ్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు సినిమా కాబట్టి క్రేజ్ ఎలాగూ ఉంటుంది.. భారీ రేట్లకు అమ్ముడు పోతుంది. కానీ బ్లాక్ బస్టర్ అయితే గానీ పెట్టుబడిని వెనక్కు తీసుకురాలేకపోవడం అనేది ఏ హీరో సినిమాకయినా మంచిది కాదని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.