Begin typing your search above and press return to search.

తమిళ తంబీల వెంటే.. వంశీ పైడిపల్లి?

By:  Tupaki Desk   |   19 Jan 2023 6:30 AM GMT
తమిళ తంబీల వెంటే.. వంశీ పైడిపల్లి?
X
తెలుగులో మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి మరోసారి మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. కానీ మహేష్ బాబు అప్పటికే పరశురాంకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమా చేయలేకపోయాడు. వాస్తవానికి మహేష్ బాబు పరశురాంకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందే వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నాడని.. ఈ కథతో మళ్ళీ సినిమా చేస్తే వర్కౌట్ కాదని ఆయన పక్కన పెట్టడంతో అదే కథలు తీసుకుని విజయ్ దగ్గరికి వెళ్లారని టాక్ కూడా ఉంది.

అదలా ఉంచితే ఇప్పుడు ఎలాగో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన వారసుడు సినిమా విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వసూళ్ల విషయంలో మాత్రం పరవాలేదు అనిపిస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయింది. కాబట్టి విజయ్ ఎలాగో తన తరువాతి సినిమా లోకేష్ కాలంగా రాజ్‌తో ప్రారంభించాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లి తర్వాతి ప్రాజెక్టు ఎవరితో ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతానికి తెలుగులో హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. చిన్నాచితక హీరోలతో వంశీ పైడిపల్లి సినిమా చేసే పరిస్థితి లేదు. దిల్ రాజు నిర్మాణం కాబట్టి కచ్చితంగా ఒక బడా హీరోతోనే సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు తెలుగు హీరోలు ఎవరూ ఖాళీగా లేని నేపథ్యంలో వంశీ పైడిపల్లి మరోసారి తమిళ హీరోల మీదే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే విజయ్‌తో సినిమా పూర్తయింది. కాబట్టి ఈసారి తాను చెప్పే కథ విని ఎవరు ఓకే చేస్తారా అని ఆయన ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే ఒక కథ సిద్ధం చేసుకున్నారని.. అక్కడి హీరోలలో ఎవరో ఒకరికి చెప్పి దాన్ని ఫైనల్ చేయించుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. తెలుగులో సినిమా చేస్తే కేవలం తెలుగు వరకే మార్కెట్ పరిమితం అవుతుందని.. మరో తమిళ హీరోతో సినిమా చేస్తే తనను తమిళ మార్కెట్లో కూడా లెక్క వేసుకుంటారని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తన క్లోజ్ ఫ్రెండ్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆయనకు ఉన్నా... మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో అది పూర్తయిన తర్వాత రాజమౌళితో సినిమాలు చేయాల్సింది. కాబట్టి అవి ఇప్పుడే పూర్తి కావు. అందుకే తాను ఒక తమిళ్ హీరోని వెతుక్కునే పనిలో పడ్డారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.