Begin typing your search above and press return to search.

దర్శకుల గ్యాంగ్.. వాటే పార్టీ

By:  Tupaki Desk   |   5 Jun 2018 5:04 AM GMT
దర్శకుల గ్యాంగ్.. వాటే పార్టీ
X

ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక పని చేసే వ్యక్తులు తరచు కలుసుకోవడం కామన్. టాలీవుడ్ లో అయితే ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. సినిమా విడుదల సమయంలో ఎంత పోటీ పడినా కూడా ఒక చోట కలుసుకున్నప్పుడు మాత్రం మన సినిమా వాళ్లు చాలా హ్యాపీగా గడిపేస్తారు. టాలీవుడ్ లో కొన్ని గ్రూపులు ఉన్నాయి. అందులో దర్శకుల గ్యాంగ్ చాలా పెద్దదని చెప్పాలి. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా కలిసిపోతూ ఎంజాయ్ చేస్తారు.

అలాగే సోమవారం రాత్రి కూడా స్టార్ దర్శకులంతా ఒక చోట చేరారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి వంశీ తన సన్నిహిత దర్శకులను మొత్తం పిలిచాడు. సుకుమార్ రాజమౌళి, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌ అలాగే అనిల్‌ రావిపూడి మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ కూడా కూడా వంశీ పైడిపల్లి ఇచ్చిన పార్టీలో పాల్గొని చాలా సేపు ఎంజాయ్ చేశారు.

ఇంతకుముందు సీనియర్ దర్శకులు కొంత మంది మాత్రమే తరచు కలిసి మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు వారితో పాటు యువ దర్శకులు కూడా కలుస్తూ మంచి వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వంశీ మహేష్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా వారు ఎవరు పనుల్లో వారు బిజీగా ఉన్నారు.