Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మీద ఆ డైరెక్టర్ ఇంకా ఆశలు పెట్టుకున్నాడా...?

By:  Tupaki Desk   |   29 April 2020 2:30 AM GMT
సూపర్ స్టార్ మీద ఆ డైరెక్టర్ ఇంకా ఆశలు పెట్టుకున్నాడా...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో సిల్వర్ జూబ్లీ మూవీగా వచ్చిన చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా మళ్ళీ మహేష్ తోనే.. అది కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సినిమా అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి విజయం అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ వంశీ పైడిపల్లి రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం 'గీతగోవిందం' డైరెక్టర్ పరశురామ్ ని లైన్లో పెట్టినట్లు న్యూస్ వచ్చింది. అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉంటుందని అనౌన్స్ చేసేసాడు. దీనితో మహేష్ - వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించాడట.

ఈ సందర్భంగా మహేష్ బాబుతో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడట. కానీ మహేష్ - వంశీ పైడిపల్లి కాంబోలో సినిమా ఎప్పుడు ఉండబోతోంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదట. ప్రస్తుతం మహేష్ సినిమాల లైన్ అప్ చూస్తుంటే వీరి కాంబోలో సినిమా రూపొందటానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మహేష్ - జక్కన్న ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక పరుశురామ్ తో మూవీ అంటున్నారు కాబట్టి అది 2021లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల గ్యాప్ లో మహేష్ ఎన్ని సినిమాలు చేయగలడో చెప్పలేము. రాజమౌళి సినిమాలో జాయిన్ కావలసిన మహేష్ మరో సినిమాను ఒప్పుకుంటాడో లేదో అనే డౌట్. జక్కన్నతో సినిమా అంటే ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 'మహర్షి' సినిమా మహేష్ బాబుతో తీయడానికి రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ పైడిపల్లి.. మరో సినిమా చేయడానికి ఇంకెన్ని ఏళ్ళు టైమ్ తీసుకుంటాడో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది ఇంత జరిగినా సూపర్ స్టార్ మీద ఆ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆశలు మాత్రం చావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.