Begin typing your search above and press return to search.

వ‌ర్మ దెబ్బ‌కు క్యూట్ హీరో హాట్ స్టార్ అయ్యాడు

By:  Tupaki Desk   |   25 March 2016 1:15 PM GMT
వ‌ర్మ దెబ్బ‌కు క్యూట్ హీరో హాట్ స్టార్ అయ్యాడు
X
రామ్ గోపాల్ వర్మ. సెన్సేషనల్ డైరెక్టర్ గానే కాకుండా టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో టాప్‌ లో ఉండే ద‌ర్శ‌కుడు. తాజాగా వంశీ త‌న కొత్త సినిమాలో మ‌రోమారు త‌న స‌త్తా చాటారు. అప్ప‌ట్లో యూత్‌ ను బాగా ఆకర్షించిన 'హ్యాపీ డేస్' సినిమాలో హీరోల్లో ఒక పాత్ర పోషించిన వంశీకృష్ణ చాగంటిని తెర‌మీద‌కు దింపాడు. గ‌ర్ల్ ఫ్రెండ్ మాయలో పడి స్నేహితులకి హ్యాండ్ ఇచ్చిన క్యారెక్టర్ పోషించింది వంశీయే. అయితే ఆ సినిమా అనంత‌రం తెర‌మీద పెద్ద‌గా క‌నిపించ‌ని వంశీని తిరిగ అద్భుతంగా చూపించాడు వ‌ర్మ‌.

ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న 'వంగవీటి'లో ప్ర‌ధాన పాత్ర అయిన‌ దేవినేని మురళి కోణంలో వంశీతో న‌టింప‌చేస్తున్నాడు వ‌ర్మ‌. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌ లో పోస్ట్ చేశాడు. హ్యాపీడేస్ ఫొటోను ఒక‌ప‌క్క‌, వంగవీటి ముర‌ళీ పాత్ర‌ను మ‌రోప‌క్క పెట్టి ఆ వంశీయే ఈ వంగ‌వీటి ముర‌ళి అని వ‌ర్మ ట్వీట్ చేశాడు. ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయిన ఫ్యాన్స్ వ‌ర్మ స‌త్తాకు నిజంగా ఖుష్ అయ్యారు. వ‌ర్మ‌ను సూప‌ర్ డూప‌ర్‌గా కీర్తించ‌డం మొద‌లెట్టారు. అయితే వర్మ ఆ గొప్ప‌కు ఉబ్బి త‌బ్బిబ్బు అవ‌కుండా...ఈ క్రెడిట్ మొత్తం చాగంటి వంశీకి క‌ట్ట‌బెట్టాడు. నిజంగా క్రేజీ రామ్ గోపాల్ వర్మ క‌దా?