Begin typing your search above and press return to search.

గ్యాంగ్ లీడర్ ని విష్ చేసిన వాల్మీకి

By:  Tupaki Desk   |   9 Aug 2019 9:53 AM GMT
గ్యాంగ్ లీడర్ ని విష్ చేసిన వాల్మీకి
X
ఇకపై ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద రసవత్తర పోరు ఉండేలా కనిపిస్తోంది. ఎంత లేదన్నా ఓ రెండు క్రేజీ స్ట్రెయిట్ సినిమాలు ప్రతి వారం పోటీ పడుతుండటాన్ని గమనిస్తే ఇదే అనిపిస్తోంది. ఓపెనింగ్స్ విషయంలో షేర్ పంచుకోవాల్సి ఉంటుందని తెలిసినా కూడా నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా హాలిడేస్ లాంటి వాటి గురించి ఎక్కువగా లెక్కలు వేసుకోకుండా కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

వచ్చే సెప్టెంబర్ 13 మరోసారి ఇలాంటి యుద్ధానికి వేదిక కానుంది. ఇవాళ నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13ని అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు ఆగస్ట్ 30 అనుకున్నారు కానీ సాహో కోసం రాజీ పడాల్సి వచ్చింది. అలా అని ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సోలోగా ఏమి రావడం లేదు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న వాల్మీకి అదే తేదీని ఇంతకు ముందే లాక్ చేసుకుని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ వచ్చి చేరింది.

కానీ ఇటు నాని అటు హరీష్ శంకర్ ఈ డేట్ల మార్పుని పోటీని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. నిన్న నాని ప్రత్యేకంగా సాహో టీమ్ ని విష్ చేస్తూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే తరహాలో హరీష్ శంకర్ కూడా నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ని రీట్వీట్ చేస్తూ ఒకే రోజు రెండు పండగలు వస్తున్నాయని సినిమా ప్రేమికులకు ఇంతకంటే ఏం కావాలని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాని యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పాడు. ఎంత పోటీ ఉన్నా ఇలాంటి ఆరోగ్యకరమైన సంప్రదాయానికి మన హీరో దర్శకులు శ్రీకారం చుట్టడం సంతోషం