Begin typing your search above and press return to search.

వాల్మీకికీ తప్పని నిరసన సెగలు

By:  Tupaki Desk   |   2 July 2019 9:15 AM GMT
వాల్మీకికీ తప్పని నిరసన సెగలు
X
ఒకప్పుడు ఏదైనా సామాజిక వర్గాన్నో లేదా కులాన్నో నేరుగా ప్రస్తావిస్తూ సినిమాలు తీస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మనోభావాలు దెబ్బ తినడం వాటి కోసం కోర్టుకు వెళ్లే వ్యవహారాలు అప్పటి దర్శక నిర్మాతలు చూసింది కూడా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతిదీ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే నిరసనల సెగలు తప్పవు. వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకికు సైతం ఇవి తప్పలేదని తాజా సమాచారం.

ప్రస్తుతం అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న వాల్మీకికి బోయ సామజిక వర్గం వాళ్ళు ఆటంకం కలిగించారట. తమ వర్గాన్ని కించపరిచే విధంగా రౌడీగా పాత్ర చిత్రణ ఉందని వెంటనే మార్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ పలుమార్లు వాగ్వాదానికి దిగడంతో దర్శకుడు హరీష్ శంకర్ ప్యాకప్ చెప్పేశారట
ఇప్పుడు దీన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసి చేవెళ్ల ప్రాంతంలో తీసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది.

హరీష్ శంకర్ ఎంతగా సర్దిచెప్పినా వచ్చిన వాళ్ళు వినలేదని కథ మీరు అనుకున్నది కాదని వరుణ్ తేజ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా రాసానని చెప్పినా వాళ్ళు వినలేదట. రామాయణ సృష్టికర్తగా ఉన్న వాల్మీకి పేరుని ఇలా వాడుకోవడం పట్ల నిరసన ఇంకా ఏ రూపం దాలుస్తుందో అని ఆందోళనగా ఉంది యూనిట్. తమిళ్ హిట్ మూవీ జిగర్ తండా రీమేక్ గా రూపొందుతున్న వాల్మీకి సెప్టెంబర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.