Begin typing your search above and press return to search.

మాస్ హీరో సినిమా అన్నికోట్ల ధర పలికిందా..??

By:  Tupaki Desk   |   1 April 2021 12:30 AM GMT
మాస్ హీరో సినిమా అన్నికోట్ల ధర పలికిందా..??
X
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు దాదాపుగా తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆ విధంగా అజిత్ తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం అజిత్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'వాలిమై'. ఈ సినిమాలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాన్ ఇండియా వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. అజిత్ చివరిగా బాలీవుడ్ పింక్ రీమేక్ 'నీర్కొండ పార్వయ్' సినిమాలో కనిపించాడు.

ఆ సినిమాను తెరకెక్కించిన హెచ్. వినోద్ ఇప్పుడు వాలిమై సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణికపూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. హ్యుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో వాలిమై ప్రీ-రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తమిళనాట వాలిమై హక్కులు 70కోట్లవరకు ధర పలికినట్లు టాక్. ఇదేగనక నిజమైతే.. ఈ లెక్కన వాలిమై సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరకే అమ్ముడయ్యాయని చెప్పవచ్చు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.